విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై శాససనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడించారు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి,
సంప్రదాయం ప్రకారం నేటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు.. కానీ, మీరు ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. CAG అకౌంట్స్ ను నిర్ధారించగలిగేలా PACని రాజ్యాంగంలో చేర్చారు.. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా PAC ఇవ్వడం జరుగుతోందన్నారు
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు పీఏసీ చైర్మన్ ఇచ్చారని తెలిపారు పెద్దిరెడ్డి.
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి వచ్చే మంగళ వారం విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది..
తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అంటేనే చెమటలు పడతాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు వెళ్లే వారికి ఈ కెనాల్ రోడ్డే దిక్కు. ఇది పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రతిరోజు యాక్సిడెంట్లు సాధారణం అయిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో బయటపడ్డవారికి లెక్కలే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కీలకమైన ఈ కెనాల్ రోడ్డుకు మాత్రం మోక్షం దక్కలేదు.
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేమ పేరుతో నమ్మించి... పెళ్లి చేసుకుంటానని వంచించిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్ను లవ్ పేరుతో ట్రాప్ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. దీంతో.. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు..