జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు.. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా.. అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు..
తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. కాసేపట్లో శ్రీవారి దర్శనంతో పాటు.. ఇతర సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్. * నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41 […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. మండలి వేదికగా నిన్నటి రోజున హాట్ కామెంట్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఎదురుగా వెళ్లి పవన్‌ను పలకరించారు.. పవన్ కల్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు
స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా శుభావార్త చెప్పారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. స్పోర్ట్స్ కో రిజర్వేషన్ 2 శాతం నుండి 3 శాతానికి పెంచనున్నట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్ తో గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారుతుందని తెలిపారు.. స్పోర్ట్స్ కోటాలో 2 శాతం నుండి 3 శాతానికి రిజర్వేషన్ పెంచుతాం.. ఒలంపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వారికి ఉద్యోగ అవకాశాల అర్హత కల్పిస్తామని పేర్కొన్నారు..