Ganta Srinivasa Rao: పంచ గ్రామాల ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్
- పంచగ్రామాల ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం..
- బాధితులకు పట్టాలు పంపిణీ చేస్తామన్న గంటా శ్రీనివాసరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao: పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు గంటా శ్రీనివాసరావు.. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు.. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలన్నీ పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు.
Read Also: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
కాగా, విశాఖపట్నంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అడివివరం, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట గ్రామాలు అవే పంచ గ్రామాల పరిధిలో 11,282 ఎకరాల భూమి ఉంది. ఇందులో గతంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించాలని భావించి.. 2005లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. 2008లో మరోసారి పరిశీలన చేసి, 421.03 ఎకరాల్లో 12,149 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. ఆ భూమికి ప్రత్యామ్నాయంగా 547.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు 2014లో కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ ప్రత్యామ్నాయ భూమి ఆలయానికి ఇచ్చి, ఆ నిర్మాణాలు క్రమబద్ధీకరణకు 2015లో మంత్రివర్గం ఆమోదించింది. ఇక, దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.. అలా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడిన సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. దీనిపై ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగగా.. ఈ రోజు పంచ గ్రామాల సమస్యపై సమీక్ష నిర్వహిచారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!