Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 9 Am 30th January 2025

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Published Date :January 30, 2025 , 9:15 am
By Sudhakar Ravula
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్..
ప్రజలకు మరింత చేరవగా సేవలు అందించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. ఇక, రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తుంది. దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇక, వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలుకుతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని తెలిపిన విషయం విదితమే..

పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి
గుజరాత్‌ రాష్ట్రంలో గ్యాస్‌ సిలండర్‌ పేలిన ఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతిచెందారు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు.. ఒంకులూరు గ్రామస్తులు , బంధువుల చెబుతున్న వివరాల ప్రకారం.. ముంద్రాకు బతుకు తెరువు కోసం వెళ్లిన వలస కూలీలు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందినవారు దుర్మరణం పాలయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలి పోవడంతో లండ రవి (38), అతని భార్య లండ కవిత (31), కుమారై లండ జాహ్నవి (3)లు మృత్యువాత పడటంతో స్వగ్రామం ఒంకులూరులో విషాద చాయలు అలుముకున్నాయి. మంగళ వారం ఉదయం లండ రవి టీ తాగడానికి గదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని వెలిగించడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. భార్యభర్తలతో పాటు కుమారై మంటల్లో చిక్కుకునిపోయింది.. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే తండ్రి రవి, కుమారై జహ్నవి మంటలలో వూర్తిగా కాలి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక, కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న కవితను ఆహ్మదాబాద్ లోని అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో మృతుల స్వగ్రామం ఒంకులూరులో విషాదం నెలకొంది.

Also Read

  • Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌
Add as a preferred
source on google

అరకు చలి ఉత్సవానికి సర్వం సిద్ధం.. రేపటి నుంచి 3 రోజులు ఉత్సవాలు..
ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. అరకు అంటేనే ఆనందం. వింటర్ సీజన్ అంటే పర్యాటకానికి మహదానందం. ఇక్కడ వుంటే కొండలు, లోయలు, జలపాతాలే కాదు ఒణికించేసే చలి.. దట్టంగా కమ్ముకునే పొగమంచు, సింగిల్ డిజిట్ టేంపరేచర్ కూడా టూరిస్టులకు పండగే. వలిసెల వయ్యారాలు.. ప్రకృతి పరవశంతో సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య అరకు అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పొగమంచుతో ఆకాశమంతా వెండిమబ్బులు దర్శనమిస్తాయి. ఇక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు, లంబసింగి, వంజంగిలో మంచు మేఘాలను చూస్తుంటే వెండి మబ్బుల ఆకాశమే దిగివచ్చిందా అన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి చిల్లింగ్ క్లైమాట్లో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం కోల్డ్‌ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి..

డిజిట‌ల్ మీడియాకు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు!
ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేస్తున్న ఆన్‌లైన్ న్యూస్ మీడియా (వెబ్‌సైట్‌, యాప్‌)కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్ విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ వారు లేఖ అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్ త్వరలోనే ఆన్‌లైన్ మీడియాకు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని కమిషనర్ ఎస్ హరీష్‌ తెలిపారు. జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ… ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుంది. డిజిటల్ మీడియాలో అనేక మంది జ‌ర్న‌లిస్టులు ప‌ని చేస్తున్నారు. ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి స‌హ‌క‌రించాల‌ని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాం. ఇందుకు సానుకూలంగా స్పందించి.. ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయం. జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా ఆకాడ‌మీ ఆక్రిడిటేష‌న్‌లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్ రూపొందంచ‌డం కొత్త మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌ప‌రిణామం’ అని అన్నారు.

నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను రూ.8,340 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. బడ్జెట్‌లో పెట్టిన ప్రతిపాదనపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తి ఉన్నారు. పార్టీ ఫిరాయించిన మేయర్‌పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు. ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదని బల్దియా వర్గాలు అంటున్నాయి. కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు టార్గెట్ చేయనున్నారు. కౌన్సిల్‌లో మేయర్‌ను నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశంపై రాష్ట్ర రాయకులతో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు.

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిల పక్ష భేటి
భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడో సారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం నేడు (జనవరి 30) ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, లోక్‌సభ డిప్యూటీ లీడర్, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, రాజ్యసభ లీడర్, ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురుగన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు, చర్చించాల్సిన అంశాలు పై తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

ప్రపంచంలోనే నరకం లాంటి జైల్లో వలసదారులను వేస్తాం : డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి రోజురోజుకు కఠినతరంగా మారుతోంది. ఆయన ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాంతించేలా కనిపించడం లేదు. అలాగే ఈ విషయాన్ని ఇప్పట్లో చల్లబరచాలని కూడా కోరుకోవడం లేదు. అందుకే ఆయన అక్రమ వలసదారులకు సంబంధించి వివిధ రకాల ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన అన్నారు. 9/11 దాడుల తర్వాత ఈ జైలును ఉగ్రవాద అనుమానితులను ఉంచడానికి ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ జైలును నరకం అని పిలుస్తారు. దీని కారణంగా అమెరికా చాలాసార్లు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. గ్వాంటనామో బేలో 30,000 మంది వలసదారులను ఉంచేందుకు పెంటగాన్ , హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖను అనుమతించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నట్లు ట్రంప్ వైట్ హౌస్‌లో తెలిపారు. ఈ చర్య అక్రమ వలసదారులను పట్టుకునే మా సామర్థ్యాన్ని వెంటనే రెట్టింపు చేస్తుంది. ఈ సమయంలో ట్రంప్ వైట్ హౌస్‌లో హత్యకు గురైన 22 ఏళ్ల అమెరికన్ నర్సింగ్ విద్యార్థిని లేకన్ రిలే తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడారు. ఈ విద్యార్థి పేరు కొత్త వలస నేరాల బిల్లు చట్టంలో చేర్చబడింది. లేకెన్ జ్ఞాపకాలను మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకుంటామని ట్రంప్ అన్నారు. నేటి చర్యతో తన పేరు మన దేశ చట్టంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన చట్టమని ట్రంప్ అన్నారు.

షాకింగ్.. ఫిబ్రవరి 1 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరు
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు. ఈ యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినిపిస్తుంది. ఏదైనా యూపీఐ యాప్ లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే (@, #, $ మొదలైనవి) ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయబడుతుంది. భారతదేశంలో లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించే అనేక యాప్‌లు ఉన్నాయి. అయితే, Paytm, Phonepe వంటి సాధారణంగా ఉపయోగించే యాప్‌లు లావాదేవీ ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించవు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అన్ని యూపీఐ యాప్‌లను లావాదేవీ ఐడీ(ట్రాన్సాక్షన్ ఐడీ)లో ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి 1, 2025 తర్వాత వాటి లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. NPCI 9 జనవరి 2025న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అన్ని UPI యాప్‌లు ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్ల(@, #, $ మొదలైనవి) ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

12 ఏళ్ల తర్వాత బరిలోకి.. అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే!
దేశవాళీ క్రికెట్‌ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా స్టార్‌ ఆటగాళ్లంతా రంజీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్ బరిలోకి దిగగా.. నేడు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, మహ్మద్‌ సిరాజ్‌లు రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున విరాట్ బరిలో దిగుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన కోహ్లీ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హర్యానాతో ప్రారంభమయ్యే గ్రూపు-సి చివరి రౌండ్‌ పోరులో కర్ణాటక తరఫున లోకేష్ రాహుల్‌ బరిలో దిగుతున్నాడు. విదర్భతో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున మహ్మద్‌ సిరాజ్‌ ఆడనున్నాడు. 17 పాయింట్లతో గ్రూపు-డి పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రైల్వేస్‌.. ఢిల్లీపై గెలిస్తే నాకౌట్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్ గెలిచినా నాకౌట్‌ చేరుకోవడం కష్టమే. తమిళనాడు (25), చండీగఢ్‌ (19), సౌరాష్ట్ర (18) జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు కర్ణాటక నాకౌట్‌ రేసులో నిలవాలంటే హర్యానాపై తప్పక గెలవాల్సి ఉంది.

హిట్ 4 కోసం రంగంలోకి బాలయ్య..?
న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా  ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్‌ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి వైరల్ అవుతోంది. గతంలో హిట్ 2 సినిమా చూసిన బాలకృష్ణ చిత్ర యూనిట్‌ని కూడా అభినందించారు. ఆ సమయంలోనే హిట్3లో బాలయ్య గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హిట్ 3 క్లైమాక్స్‌లో ఒక మాస్ హీరో కనిపిస్తారని ఆ హీరోతోనే హిట్ 4 ఉంటుందని అంటున్నారు. దీంతో హిట్ 3 క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చేది బాలయ్యనే అని, హిట్ 4 హీరో ఆయనే అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఒకవేళ బాలయ్య ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయితే మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్యను చూస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఓ వైపు హీరోగా చేస్తునే నిర్మాతగా కూడా రానిస్తున్నాడు నాని. ఇటీవలె శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్‌తో ఓ మాస్ సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బాలయ్యతో కూడా తన నిర్మాణంలో హిట్ 4 చేసే ఛాన్స్ లేకపోలేదు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే హిట్ 3 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప 2.. ఎందులో చూడాలంటే.?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 తో  మాస్ తాండవం చూపించారు. రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా  ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే చైనాలో పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడితో ఇండియన్ నెంబర్ 1 మూవీ ఉన్న దంగల్ రికార్డ్ బ్రేక్ కానుంది. అయితే  రీసెంట్‌గా రీ లోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. కాగా పుష్ప 2 ఓటిటి డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ అభిమానుల కోరిక తీరింది. ఇక ఇప్పుడా ఆ సమయం రానే వచ్చేసిందని చెప్పాలి. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. జనవరి 30న అనగా నేటి నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకువచ్చిన నెట్ ఫ్లిక్స్ కన్నడ భాష స్ట్రీమింగ్ కు మరికొద్ది రోజుల్లో జత చేయనుంది.  మరి ఓటిటిలో పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ 3 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఓటీటీలోకి వచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్

  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత

  • Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!

  • Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..

  • Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions