Inter 1st Year Exams: సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ యథాతథం
- ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ పై సర్కార్ కీలక నిర్ణయం..
- ఇంటర్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై ప్రజల నుంచి సూచనలు..
- ప్రస్తుతానికి పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter 1st Year Exams: ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మధ్యే విద్యాశాఖలో మార్పులు చేయాలని నిర్ణయించారు.. అందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టె ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని వెల్లడించిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
Read Also: TS Inter Hall Ticket: విద్యార్థుల మొబైల్‌లకే ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు!
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
అయితే, ఇంటర్ పరీక్ష విషయంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26వ తేదీ వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఆసక్తికరమై ఫీడ్‌బ్యాక్ వచ్చింది.. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదవుపై ఫోకస్ పెట్టరని.. అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది ఇంటర్ బోర్డ్. ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.. అయితే, గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వనున్నారు.. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్.. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగా ఉండనుంది.. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకునే వీలుంది.. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్ బోర్డు సమావేశం నిర్వహించి తీర్మానం చేయనుంది..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!