Araku Chali Utsav: అరకు చలి ఉత్సవానికి సర్వం సిద్ధం.. రేపటి నుంచి 3 రోజులు ఉత్సవాలు..
- ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం..
- గిరిజన సాంప్రదాయ కార్నివాల్..
- ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే..
- ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్..
- జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Chali Utsav: ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. అరకు అంటేనే ఆనందం. వింటర్ సీజన్ అంటే పర్యాటకానికి మహదానందం. ఇక్కడ వుంటే కొండలు, లోయలు, జలపాతాలే కాదు ఒణికించేసే చలి.. దట్టంగా కమ్ముకునే పొగమంచు, సింగిల్ డిజిట్ టేంపరేచర్ కూడా టూరిస్టులకు పండగే. వలిసెల వయ్యారాలు.. ప్రకృతి పరవశంతో సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య అరకు అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పొగమంచుతో ఆకాశమంతా వెండిమబ్బులు దర్శనమిస్తాయి. ఇక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు, లంబసింగి, వంజంగిలో మంచు మేఘాలను చూస్తుంటే వెండి మబ్బుల ఆకాశమే దిగివచ్చిందా అన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి చిల్లింగ్ క్లైమాట్లో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం కోల్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఏపీ పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి..
Read Also: Budget Session : రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిల పక్ష భేటి
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
అరకు రీజియన్‌కు విస్తృతమైన ప్రమోషన్ కల్పించడం ద్వారా పర్యాటక పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా అరకు చలి ఉత్సవ్‌ను స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించి కోటి రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ నెల 31న జానపద కళాకారులతో భారీ కార్నివాల్‌తో అరకు ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది. మంత్రి కందుల దుర్గేష్ చలి ఉత్సవ్ ప్రారంభిస్తారు. ఏడు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారులు సంప్రదాయ ప్రదర్శనలు చేయనున్నారు. దేశంలో ఉన్న గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించేందుకు రెడీ అయింది. కేవలం కల్చర్ ఒక్కటే కాదు.. అడ్వెంచర్ ఈ వేడుకల్లో పర్యాటకులకు సొంతంకానుంది. హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ తో పాటు తొలిసారి హెలీ రైడ్ అనుభూతి దక్కించుకునే ఏర్పాట్లు జరిగాయి. ప్రైవేట్ సంస్ధ మూడు రోజుల పాటు హెలీరైడ్ కోసం అనుమతులు పొందింది. ఐదు నిముషాల పాటు అరకు వ్యాలీ మొత్తం హెలీకాఫ్టర్‌లో విహంగ వీక్షణం చేయడం మరుపురాని అనుభూతిగా వుంటుందని నిర్వహకులు చెబుతున్నారు.
Read Also: Donald Trump : ప్రపంచంలోనే నరకం లాంటి జైల్లో వలసదారులను వేస్తాం : డొనాల్డ్ ట్రంప్
అరకు చలి ఉత్సవ్ ధూంధాంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. ప్రధాన వేదిక దగ్గర రోజూ 15 నుంచి 20 వేల మంది వుంటారని అంచనా. ఇక పర్యాటకులు, స్ధానికులతో కలిసి ఫుట్ ఫాల్ 50 వేలకు పైగా వుంటుందని లెక్కలేస్తున్న జిల్లా యంత్రాంగం.. అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!