Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ అధికారికంగా ఆమోదించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన లేఖను ప్రతినిధి ద్వారా మేయర్ రాజీనామా లేఖను అందజేయగా, అదే రోజు రాత్రి కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేయర్ పదవి ఖాళీ కావడంతో ఇంచార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టే […]
ఏపీలో నేడు వైసీపీ ర్యాలీలు.. కేంద్ర కార్యాలయానికి చేరనున్న కోటి సంతకాలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈనెల 18న గవర్నర్‌కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ […]
Andhra Pradesh: కూటమి ప్రభుత్వం అడ్డూఅదుపు లేకుండా అప్పులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాండ్స్ అమ్మి 5750 కోట్ల అప్పు తీసుకోబోతున్నారని చెప్పారు. సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు […]
Minister Nara Lokesh:ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టారు.. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. అమరావతి చట్టబద్ధతకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్లతో భేటీకానున్నారు.. విద్య, ఐటీ సంబంధిత […]
YSRCP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈనెల 18న గవర్నర్‌కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్‌ని కోరనున్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో […]
* ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్న మోడీ.. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్‌లో భాగంగా మోడీ పర్యటన.. ఆ ఆదేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్న భారత్ * ఢిల్లీ: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్యాస్ ఛాంబర్ లా మారిన ఢిల్లీ.. దేశ రాజధానిలో 400 ల పాయింట్లు దాటిన AQI.. కొన్ని హాట్ స్పాట్ ల్లో […]
Off The Record: క్షేత్ర స్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి పోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్‌లో అయితే… పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చుగానీ… వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా… కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్ళే దెబ్బ కొట్టడం […]
Off The Record: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు జోరుగా నడుస్తున్నాయి. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్న లెక్కల్లో ఎవరికి వారు మునిగితేలుతున్నారు. ప్రతిపక్షం బీఆర్ఎస్లో దీనికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. తొలి విడతలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1144 చోట్ల గెలిచారు. ఈ నంబర్ని ఆ పార్టీ అస్సలు ఊహించలేదట. దీంతో మిగతా రెండు విడతల్లో జాగ్రత్తలు తీసుకుని సత్తా చాటాలనుకుంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో […]
Off The Record: శత్రువులు ఎక్కడో ఉండర్రా…. కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్ సినిమా డైలాగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పదేపదే గుర్తుకు వస్తోందట. ఎంత సర్దుకుపోదామన్నా…. చెల్లెలు కవిత అస్సలు వదిలిపెట్టం లేదని ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత తాజాగా అన్నను డైరెక్ట్‌గా అటాక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. పైగా… ఏ విషయంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందో… అదే […]
Roja vs TDP: మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, విజయపురం ఎంపీపీ లక్ష్మీపతిరాజు, నిండ్ర ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. […]