Road Accidents: పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాదు నుంచి బాపట్ల వెళ్లతున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదంలో ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుటలోకి వెళ్ళింది. రోడ్డు నిర్మాణం పనులకోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పైప్ కు తగిలి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు […]
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ […]
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో […]
Karthika Masam 2025: కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు వేలాదిగా తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి చుట్టూ ప్రక్కల నుండి భారీగా భక్తులు పుష్కరఘాట్ కు తరలి వస్తున్నారు. స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు అనంతరం గోదావరి లో కార్తీక దీపాలు వదులుతున్నారు. రాజమండ్రి కోటి లింగాల ఘాట్ , మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమీ […]
Central Team Visits Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాన్ విధ్వంసమే సృష్టించింది.. ఈ తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక కూడా పంపింది.. అయితే, నేడు, రేపు ఆంధ్రప్రదేశ్లోని ‘మొంథా తుఫాన్’ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర IMCT బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు ఉన్నతాధికారులు ఉన్న ఈ బృందం.. రెండు టీమ్లుగా విభజించబడింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ […]
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు […]
Seediri Appalaraju House Arrest: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో, పలాసలో జీడి వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శిష్టు గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం […]
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. పార్టీ వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల సాధన, రెవెన్యూ సమస్యల పరిష్కారం, సాంకేతిక పురోగతి వంటి అంశాలపై వివరించారు. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తి చేస్తాం.. డిసెంబర్ నుండి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.. అలాగే, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలపై కసరత్తు కొనసాగుతున్నదని చెప్పారు చంద్రబాబు.. Read Also: Top […]
వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతోంది..? 2017లో ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో 151 సీట్లతో అధికారం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. 2027లో పాదయాత్ర 2.0 కూడా వైసీపీకి పునరుజ్జీవన శక్తిగా మారనుందని నేతలు విశ్వసిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని 2027 జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు […]
Story Board: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్…సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఊరించే ప్రకటనలు…సెలబ్రెటీల ప్రచారంతో…అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులనుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల దాకా…వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. కోట్లు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్లో పెడుతున్నారు. అది సరిపోక…బ్యాంక్ల నుంచి లోన్లు తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. బెట్టింగ్ యాప్స్…సామాన్యులకు మరణశాసనం రాస్తున్నాయి. బెట్టింగ్ ఆడవద్దని చెబుతున్నా…కొందరు పట్టించుకోవడం లేదు. డబ్బు పొగొట్టుకున్న తర్వాత…ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇంకొందరు దొంగలుగా మారుతున్నారు. మరికొందరు […]