ఈ రోజు సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబ సభ్యులతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్ జగన్.. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వనుంది వైసీపీ.. డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళనకు పిలుపునిచ్చారు.. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ SE,CMD కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలని.. విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది..
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్ను దాటింది.. వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీనితో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా 1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు..
అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్.. విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచీ వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి.
వైసీపీ కంచుకోట పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్. ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో... అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి. అందుకే 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టగలిగింది. గత ఎన్నికల్లో అయితే... రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం సృష్టించినా... ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు...
తోట త్రిమూర్తులు, వైసీపీ ఎమ్మెల్సీ.. గతంలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారాయన. అప్పటి పరిణామాలను బట్టి వేర్వేరు పార్టీల తరపున ప్రాతినిధ్యం వహించారు. అయితే... గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మండపేట నుంచి తొలిసారి బరిలో దిగి ఓడిపోయారు త్రిమూర్తులు. అయితే ఇప్పుడాయన లెక్కలు పూర్తిగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. మొదట్నుంచి రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యమని చెప్పే తోట త్రిమూర్తులు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహబూబ్నగర్ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని.. తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే .. వ్యూహం మారినట్టు కనిపిస్తోందన్నది వారి మాట. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. రైతులకి ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామని చెబుతూనే.. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
టీడీపీలో మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించిన తర్వాత..…