Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు వంశీ.. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు.. పాండురంగారావు పై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదు.. పోలీసులు రాజకీయ కారణాలతో తనను నిందితునిగా చేర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.. తనతో పాండురంగారావుకు గతంలో ఉన్న రాజకీయ విభేదాలతో ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని ఈ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ..
Read Also: PM Modi: ఖతార్ అమీర్‌కు ఆలింగనంతో స్వాగతం పలికిన ప్రధాని మోడీ.. (వీడియో)
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.. వంశీ తో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా 10 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో టెక్నికల్ మిస్టేక్స్ ఉండడంతో న్యాయమూర్తి దాన్ని మార్చి ఇవ్వాలని ఆదేశించారు దీంతో పోలీసులు కస్టడీ పిటిషన్ లో మార్పులు జరిపి మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. మరోవైపు రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి బెయిల్ ఇవ్వాలని వంశీ తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం తనపై రాజకీయ వ్యక్తిగత కక్షతో నమోదు చేసిన కేసుగా వంశీ పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను తాను కిడ్నాప్ చేశానని నమోదు చేసిన కేసు కూడా కక్షపూరితంగా చేసిందని వంశీ పిటిషన్ లో తెలిపారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో 2023 ఫిబ్రవరి 23న సత్య వర్ధన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తనను ఎవరు తిట్టలేదని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారని వంశీ తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా సత్య వర్ధన్ అఫిడవిట్ రూపంలో సత్య వర్ధన్ తెలియజేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను సత్యవర్ధన్‌ను బెదిరించాల్సిన అవసరం ఏముంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లు విచారణకు ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. రెండు వర్గాలకు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వటంతో రేపు కౌంటర్లు ఇరు వర్గాలు దాఖలు చేయనున్నారు పిటిషన్లు మీద రేపు లేదా ఎల్లుండి విచారణ చేయనున్నారు.