భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. భూదందాలపై ఉక్కు పాదం మోపుతామంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు.. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చాం.. వైఎస్ జగన్ రెడ్డి అరాచకపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో.. ఇటు కమర్షియల్ రాకెట్ ప్రయోగాలపై కూడా దృష్టిసారించింది.. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను.. ఇతర సంస్థలకు చెందిన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది..
మరో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.
ఒక రాజకీయ పార్టీని వదిలి బయటికి వెళ్ళే నాయకులు ఆ పార్టీని విమర్శించడం, పరిస్థితినిబట్టి వీలైనంత ఎక్కువ బురద చల్లేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అటు పార్టీలు కూడా ఒక నాయకుడు బయటికి వెళ్ళిపోతున్నాడన్న ఫీలర్ రాగానే... ముందే బహిష్కరించడమో... లేదా పొమ్మనకుండా పొగబెట్టడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫలానా పార్టీని నమ్ముకుని చెడ్డవాళ్ళనో, లేక ఫలానా పార్టీ అధ్యక్షుడి వైఖరితో నష్టపోయిన వాళ్ళనో... రకరకాల చర్చలు జరుగుతుంటాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యంపై ఏపీ సర్కారు సీరియస్‌గా ఉన్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ బియ్యం విషయంలో ప్రభుత్వం సీరియస్ అవడంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ మంగళగిరిలో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక విభాగాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు పాల్గొని సుమారు రెండు గంటల పాటు చర్చించారు. పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. పలు అంశాలు ఏటూ తేలక పోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించి భేటీని ముగించారు. అయితే, తెలుగు రాష్ట్రాల విభజన అంశంపై మరో ముందడుగు పడింది. ఇరు…