TDP and BJP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వంగా ఒక్కటిగా ఉన్నా.. పార్టీల పరంగా ఎవరిదారిలో వారు వెళ్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఇటీవలే బీజేపీ కొన్ని చేరికలపై దృష్టి పెట్టింది… మొన్న రాజ్యసభలో కృష్ణయ్య కు అవకాశం ఇచ్చింది.. అలాగే కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో పడింది బీజేపీ. అయితే, బీజేపీలో నేతల చేరిక విషయమై మిత్రపక్షం టీడీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గత ప్రభుత్వం పాలనలో వైసీపీలో ఉండి తమ కేడర్‌ను ఇబ్బందిపెట్టిన నేతలను చేర్చుకోవద్దని టీడీపీ చెబుతున్నట్టు సమాచారం… టీడీపీ క్యాడర్‌ను వేధించిన వాళ్లు.. బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Read Also: Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నన్ను ఇరికించే ప్రయత్నం..!
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరాలనుకోగా.. స్థానిక నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం.. బీజేపీలో చేరాలి అనుకుంటే… టీడీపీ నేతలు అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం. తోట త్రిమూర్తులు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.. తాము రాజకీయంగా బలపడే విషయంలో ఎవరిని చేర్చుకుంటే టీడీపీకి ఎందుకని బీజేపీ నేతలు చెబుతున్నారు. కూటమి సర్కార్‌కు మద్దతిస్తాం కానీ.. పార్టీలో నేతల చేరికపై టీడీపీకి సమస్యేంటంటున్నారు బీజేపీ నేతలు. గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. టీడీపీలోకి వెళ్ళాలి అనుకుని. జనసేనలో చేరారు. ఇదే బాటలో మరికొందరు పయనిస్తున్నారు. అయితే.. టీడీపీ అభ్యంతరాల వల్ల… తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేరే నేతల విషయంలో క్లారిటీగా ఉండాలని బీజేపీ చీఫ్ పురందేశ్వరికి జాతీయ నేతలు చెప్పినట్లు సమాచారం.. మరి భవిష్యత్తులో చేరికలపై బీజేపీ, టీడీపీలు ఎలా వ్యవహరిస్తాన్నది ఆసక్తికరంగా మారింది.