Undavalli Arun Kumar: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. ఏపీకి పవన్ కల్యాణ్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.. ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.. మన రాష్ట్రం మీద ఆధారపడి కేంద్రం వుంది. ఇదే అదును.. ఇప్పుడే డిమాండ్స్ సాధించుకోవాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లా ప్రకారం వెళ్తుందనే నమ్మకం నాకుంది.. కానీ, విభజన సమయంలో కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు.. ఇక, మంచి ఐడియల్ సమయం ఇది.. చంద్రబాబు టాక్టీస్ ఏ వ్యక్తికి ఎవ్వరికీ ఉండరు.. ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన తలచుకుంటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాదనే నమ్మకం నాకుంది.. దీనిపై పవన్ కు లేఖ కూడా రాశాను అని వెల్లడించారు..
Read Also: Aprilia Tuono 457: ఇటాలియన్‌కు చెందిన 457 సీసీ స్పోర్ట్ బైక్ విడుదల.. ధర తక్కువే!
విభజన హామీలో 75 వేల 50 కోట్లు రాష్ట్రానికి రావాలి.. దీనిపై పార్లమెంటులో ప్రస్తావించమని కోరాను అన్నారు ఉండవల్లి.. కేంద్రంతో పవన్ కల్యాణ్ మాట్లాడితే పరిష్కారం వుంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్ సాధిస్తారనే నమ్మకం ఉంది.. ఇందులో సాధించడానికి లోక్‌సభకు నోటీసు ఇవ్వాలి.. నోటీసు ఎలా ఇవ్వాలో కూడా లేఖలో పేర్కొన్నాను.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై చర్చించదానికి సిద్ధం అని చాలా సార్లు చెప్పారు .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటులో చర్చించే నిర్ణయం తీసుకోవాలి.. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం చేసిన రోజు ఇదే.. 1 లక్ష 42 వేల 600 కోట్లు ఇంకా పంచలేదు. 42 శాతం వాటా తెలంగాణకు వెళ్తుందన్నారు.. ప్రభుత్వ రంగ సంస్థలు విభజించ లేదు.. ఎందుకో ఆశ పవన్ కల్యాణ్ మీద వుంది.. గతంలో విభజన హామీలు పై పవన్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలో 2 గంటలు చర్చించాం.. పవన్ స్పందిస్తే దీని మీద సుప్రీం కోర్టు లో వున్న విభజన కేసులకు తాను తిరగడం తగ్గుతుందన్నారు.. ఇక, తాను పవన్ కల్యాణ్ గురించే మీడియా సమావేశం ఏర్పాటు చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..