Pawan Kalyan: జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది జనసేన పార్టీ.. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ సారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేనాని నిర్ణయం తీసుకుంది.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం అంటే.. 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో జనసేన ఘన విజయం సాధించడమే కాకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, ఎన్నికల్లో అపూర్వ విజయం అనంతరం మొదట ఈ ఆవిర్భావ సభ జరగనుంది.. అదికూడా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం వేదికగా జరగనున్న నేపథ్యంలో.. జనసేన ఆవిర్భావ వేడులకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది..
Read Also: CM Revanth Reddy : సాగునీటిపై రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయితే, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించాలని గతంలో ఆ పార్టీ నిర్ణయించింది. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్వర్యంలో జరిగిన పీఏసీ సమావేశంలో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని కమిటీ భావించింది. మార్చి 12 ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం అతిథులతో.. 14న బహిరంగ సభ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజా ప్రకటనలో మాత్రం.. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు పేర్కొన్నారు.. మరి ప్రతినిధుల సభపై తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి..