AP High Court: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనితీరుపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.. అయితే, రాష్ట్రంలో 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే.. 1001 స్టేషన్లోనే ఎందుకు సీసీ కెమెరాలు పెట్టారని ప్రశ్నించింది హైకోర్టు.. మిగిలిన స్టేషన్‌లో ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నిలదీసింది.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీలు పెట్టారా? లేదా..? అని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు సంగతి కూడా చెప్పాలని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
Read Also: Mahakumbh: కుంభమేళా స్టార్ట్స్.. అందంతో మోనాలిసా, వేప పుల్లలమ్మి ఫేమస్ అయిన ఆకాశ్
కాగా, గతంలోనూ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై విచారణ జరిగింది.. పీఎస్‌లు, జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ, సాంకేతిక లోపాల కారణంగా చాలా వరకు సీసీ కెమెరాలు పని చేయడం లేదని.. పీఎస్‌లు, జైళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పురోగతి లేకపోవడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయ్యింది.. ఇక, ఆ పిటిషన్‌పై విచారణ స్పందర్భంగా.. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,001 పోలీస్ స్టేషన్‌ల్లో పది వేలు, 81 జైళ్లలో 1,752 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం పేర్కొనగా.. ఇప్పుడు మరోసారి సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు..