AP Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు.. ఇక, తొలిసారి రూ. 3 లక్షల కోట్లు దాటింది ఏపీ వార్షిక బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటేసింది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. అయితే, ఏపీకి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయంతో పాటు.. వ్యయాలు కూడా ఓసారి పరిశీలిస్తే..
ఏపీ బడ్జెట్ 2025 – 26:
* పన్నుల ద్వారా ఏపికి సొంతంగా వచ్చే ఆదాయం రూ.1,09,007 కోట్లు..
* నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయం రూ.19,119 కోట్లు.
* కేంద్ర పన్నుల వాటా రూ. 57,566 కోట్లు.
* ప్రస్తుత ఏపీ జనాభా 5.3 కోట్ల మంది.
* ప్రజల జీవిత కాలం 70.6 సంత్సరాలు.
* ప్రస్తుత అర్బన్ జనభా 36 శాతం.
* ప్రస్తుత లిటరసీ రేట్ 72 శాతం.
* ప్రస్తుత జనాభాలో మహిళల లేబర్ పోర్స్.. 45.8 శాతం.
* ప్రస్తుతం ఏడాదికి జీడిపి గ్రోత్ రేట్ 14.39 శాతం..
* వచ్చే మరో ఐదేళ్లలో జీఎస్డీపీ 29.29 శాతానికి పెరుగుతుందని అంచనా.
* ప్రస్తుతం ఏపీ జీఎస్డీపీ 170 బిలియన్ డాలర్లు.
* పర్ క్యాపిటా ఇన్ కమ్ 3200 బిలియన్ డాలర్లు.
* ఏపీ ఎక్స్ పోర్ట్స్ 19.3 బిలియన్లు డాలర్లు.
* స్వర్ణాంద్ర విజన్ – 2047కి పది సుత్రాల పేరుతో ఈ సారి బడ్జెట్ లో తొలిసారి కేటాయింపులు
* పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.12,112 కోట్లు కేటాయింపు.
* ఆర్ధిక మరియు సాంకేతిక అభివృద్దికి రూ.55,730 కోట్లు కేటాయింపు.
* సామాజిక తరగతుల అభివృద్దికి రూ.1,42,349 కోట్ల రుపాయిలు కేటాయింపు.
* కరువు రహిత రాష్ట్రం, అగ్రికల్చర్ కోసం రూ.29,665 కోట్లు.
* మొత్తం రెవిన్యూ రాబడి రూ.2,17,977 కోట్లు..
* రెవిన్యూ రిసిప్ట్స్ రూ.1,04,382 కోట్లు
* క్యాపిటల్ ఎక్స్పెడెచర్ రూ.40,636 కోట్లు
* రెవిన్యూ ఖర్చులు రూ. 2,51,163 కోట్లు.
* రాష్ట్రం అప్పులు జీఎస్డీపీలో 35 శాతం …