విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్టైల్...కూటమిలో చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే ఆదోని ప్రాంతంలో బీజేపీకి బలం లేదు. కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో ఆ పార్టీ టికెట్ దక్కించుకుని పార్థసారథి గెలుపొందారు. గతంలోనూ టీడీపీ పొత్తులో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోందట.
బీజేపీ ఎందుకు...అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే...ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు...అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి సవాళ్లతోనే పార్టీని నడుపుతున్నారు అధినేత జగన్మోహన్రెడ్డి. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ...67 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలను జగన్...సమన్వయం చేయటంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. పట్టుదలగా పని చేసిన జగన్ పార్టీకి...175 స్థానాలకు 151 సీట్లు కట్టబెట్టారు. 50 శాతం పైగా ఓట్లు సాధించి...అధికారంలోకి వచ్చారు. కేడర్ కూడా పార్టీ అధికారంలోకి రావాలన్న కసితో పనిచేయడంతో వైసీపీకి ఊహించని విజయం లభించింది. ఆ తర్వాత…
డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసులు. దీంతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వీడనుంది. మృతదేహాన్ని పార్సల్ చేసి పోలీసులను ముప్పు తిప్పులు పెట్టిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
తన సొంత జిల్లాలో మరోసారి పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న ఆయన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.
భూప్రకంపనలు ప్రకాశం జిల్లాను వీడడం లేదు.. వరుసగా మూడు రోజుల నుంచి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.. తాజాగా, ముండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. రాత్రి 8:15 నిమిషాలకు.. 8:16 నిమిషాలకు.. 8:19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు..
భోగాపురం అద్భుతమైన ప్రాజెక్టుగా పేర్కొన్న ఆయన.. శరవేగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నాం అన్నారు.. జూన్ 2026 కే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయని పూర్తి చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు.. విశాఖ ఎయిర్పోర్ట నుంచి అన్ని విభాగాల తరలింపు కూడా వేగవంతం చేస్తు్న్నామని వెల్లడించారు కేద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు..
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంగా.. మూడు రోజుల పాటు.. అంటే గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు..