బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమీక్షలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా చర్చించారు.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు.. అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టనున్నారు.. అర్హులకు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా త్వరలో చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు..
కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు బిజీ బిజీగా గడిపారు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధిశాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నాను గనుక మాట్లాడకూడదు అంటే కుదరదంటున్నారు. గత ఐదేళ్లు కార్య కర్తలను ఇబ్బంది పెట్టినవాళ్లను కూటమి పార్టీలు చేర్చుకోవద్దని హితవు పలికారు.. ఇక, గంజాయి వల్ల జరిగే అనర్ధాలు, యువత ఎదుర్కోంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా వున్నాయని అన్నారు. గంజాయి కేసుల కోసం అయితే తన ఇంటి గుమ్మం కూడా ఎక్కొద్దని స్పష్టం చేశారు.. ఇక, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా…
ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.. మహిళల ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్గా.. హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం..