Shakti App: “శక్తి”యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. ఎలా పనిచేస్తుందంటే..?
- మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..
- ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన "శక్తి" యాప్ ఆవిష్కరించిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakti App: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం..
శక్తి యాప్ ఎలా పనిచేస్తుంది..?
పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ “శక్తి” యాప్‌కు జోడించిది ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్.. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు “శక్తి” యాప్ కీలకంగా పనిచేయనుంది.. వన్ టచ్ SOS బటన్- వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది. Shake Trigger/Hand Gesture SoS- యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు. దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కి పంపబడుతుంది.. తద్వారా పోలీసు అధికారుల తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తోంది..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
శక్తి యాప్‌లో కీ ఫ్యూచర్స్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఈ శక్తి యాప్‌లో కీలకమైన ఫ్యూచర్స్ ఉన్నాయి.. ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్టు చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్టు చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్, అత్యవసర కాంటాక్ట్.. ఇలా ఎన్నో అధునాతన ఫీచర్స్ ను ఈ “శక్తి” యాప్ లో పొందుపరిచింది ఏపీ పోలీసుశాఖ. కాగా, ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!