RK Roja: సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు.. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు.. తల్లికి వందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు.. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అంటూ దుయ్యబట్టారు.
Read Also: Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు..
నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు రోజా.. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్ధం అయింది.. అందుకే శక్తియాప్ పేరుతో యాప్ ని తెస్తున్నారు.. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు.. మహిళా భద్రత గురించి కేబినెట్‌లో ఏనాడూ చర్చించలేదు.. కానీ, గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారని మండిపడ్డారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్మతున్నారు.. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లిందని విమర్శించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు..? కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు..? కనీసం, సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు.. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు అని నిలదీసిన ఆమె.. అసలు, మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కల్యాణ్‌కి లేదన్నారు. మహిళల కన్నీటి శాపనార్ధాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది.. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు.. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ది చెప్తారని హెచ్చరించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..