కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య రూ.300 విషయమై ఘర్షణ జరిగింది.. అదికాస్తా దాడికి దారిసింతి.. చాట్ల సతీష్ (27) పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యారు చాట్ల సతీష్.. దీంతో, అతడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు.
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం.. వారిని గుర్తుపెట్టుకుంటామని…
జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా బలహీనపడింది.. ఇక, అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి..
23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40 వేల టికెట్ల కోసం టీటీడీ వెబ్…
కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడులు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, భారతి దంపతులతో పాటు వైఎస్ విజయమ్మ.. వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఉదయం 8.45 గంటల నుండి 11 గంటల వరకు తల్లి వైయస్ విజయలక్ష్మి, సతీమణి భారతి, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి కేక్…
తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది.
సంచలనం సృష్టించిన డెడ్బాడీ హోమ్ డెలివరీ కేసులో ట్విస్టులమీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరిజిల్లా యండగండిలో ఈనెల 19వ తేదీన సాగి తులసి అనే మహిళ ఇంటికి చేరిన పార్సిల్ డెడ్బాడీ కేసులో పోలిసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మ రెండో భార్య రేవతి పాత్రపై అనుమానాలు వ్యక్తం…