CM Chandrababu: ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఇంటరాక్షన్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరి డెవలప్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇక, నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశానని గుర్తుచేసుకున్నారు.. గంజాయి, డ్రగ్స్ తాగి ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం. మహిళలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా. గత ఐదేళ్లు మహిళలు స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి లేదు. మహిళలను బలవంతంగా మీటింగ్ కి తీసుకువచ్చి బయటకు వెళ్ళకుండా చేసేవాళ్లు అని విమర్శించారు.
Read Also: Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్‌లను కొనలేము..
అయితే, మహిళలు ఇంటి నుండి పని చేసేందుకు గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెడతాం. కంపెనీలు తీసుకువచ్చే బాధ్యత నాది.. పని చేసే విధానం మీదన్నారు సీఎం చంద్రబాబు.. చైనా, జపాన్ లో జనం సంఖ్య తగ్గిపోతుంది. సంపాదించింది అనుభవించడానికి కూడా వారసులు లేకుండా పోతున్నారన్న ఆయన.. గతంలో ఒక్కరినే కనమని చెప్పాను. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మందిని కనమని చెబుతున్నాను. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం లేకుండా చట్టం చేశాం. ఇప్పుడు ఇద్దరి కంటే తక్కువ ఉంటే పోటీ చేసే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. తల్లికి వందననం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 ఇస్తాం. ఐదు మంది పిల్లలు ఉన్నా.. 60వేలు ఇస్తామన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్ని సార్లు అయినా మెటర్నిటీ సెలవులు ఇస్తాం అన్నారు.. విజన్ 20-20 ఇచ్చి హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాం. 2047కి ప్రపంచంలో అగ్ర దేశంగా భారత దేశం ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Ntv Exclusive: దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ?
రతన్ టాటా ఛైర్మన్ అయిన తరువాత టాటా కంపెనీని ఆకాశానికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. ప్రతి ఇంట్లో ఒక అంట్రప్రీమియర్ ఉండాలి. మహిళల కోసం 45 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. ప్రజల కోసం వాట్సాప్ గవర్నర్ తీసుకువచ్చాం.. ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నర్ లో అయిపోతుందన్నారు.. వాట్సాప్ ద్వారా 200 సర్వీసులు ఆన్ లైన్ లో పెట్టాం… రాబోయే రోజుల్లో వెయ్యి సర్వీసులు పెడతామని వెల్లడించారు.. మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డారు. మేజర్ పంచాయతీల్లోనూ అరకు కాఫీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉంది. అరకు కాఫీకి పాతికేళ్ల క్రితమే బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాను. ప్రతి గ్రామంలో వీటి ఔట్‌లెట్స్ ఏర్పాటు కావాలి. అరకు కాఫీ మరో స్టార్ బక్స్ లాంటి ప్రత్యేక కాఫీ షాప్ లాగా కావాలన్నారు.. హైదరాబాద్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం గతంలో 35 ఎకరాలు కేటాయించాను. మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..