అల్లు అర్జున్ ఎపిసోడ్లో పార్టీ నాయకులు.. గప్‌చుప్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్ప సినిమా వ్యవహారంలో ప్రభుత్వం.. పోలీసులు చూసుకుంటారని దానిపై రాజకీయ నాయకుల కామెంట్స్ అవసరం లేదని హెచ్చరించారు. అనవసరంగా నాయకులు ఎదురుదాడి చేస్తే తలనొప్పి వస్తుందని ముందే గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి...పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి.. వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను.. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది అని పేర్కొన్న సీఎం చంద్రబాబు
వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అంచనాలు వున్నాయి.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళుతున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలకు అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు..