ప్రపంచకప్ విజేతలు.. మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కల్యాణ్ సన్మానం.. ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2 […]
CM Chandrababu Delhi visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహాయాలపై కీలక చర్చలు జరపనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.. అదే రాత్రి కేంద్రంలోని కీలక నాయకులను, ఉన్నతస్థాయి అధికారులను ఆయన కలిసే […]
Maredumilli–Chintur Ghat Road: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డులో ఈ రాత్రి నుండి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు […]
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక రైతులతో కలిసి వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల.. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. Read Also: Akhanda 2: […]
Deputy CM Pawan Kalyan: ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. […]
Off The Record: గాల్లో ఎగరాల్సిన ఇండిగో విమానం…ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి…చివరకు ఏపీ మంత్రి లోకేష్ గాలి తీసేసే వరకు వచ్చిందా అంటే… ఎస్ అన్నదే ఈ పరిణామాలను గమనిస్తున్నవారి సమాధానం. తన ప్రమేయం లేకుండానే ఈ ఎపిసోడ్‌లోకి లాగి… అనవసరంగా ట్రోల్ చేయిస్తున్న పార్టీ నాయకుల్ని చూసి చివరికి లోకేష్ కూడా…. అరె ఎవుర్రా మీరంతా… అన్న సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటున్నారట. టీడీపీ అభిమానులు కూడా… ఎక్కడ తయారయ్యార్రా వీళ్ళంతా….. అనవసరమైన ఇష్యూలోకి ఆయన్ని లాగి […]
Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ, ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టెర్లింగ్ రిసార్ట్స్ ద్వారా హోటల్ మరియు టూరిజం రంగాల […]
Off The Record: 2024 ఎన్నికల ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న వైసీపీ అధినేత జగన్…. అప్పుడు దూరమైన వర్గాలను తిరిగి దరి చేర్చుకునే పనిలో సీరియస్‌గా ఉన్నారు. వన్ బై వన్ హర్డిల్స్‌ను దాటుకుంటూ వస్తున్న క్రమంలో… ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా…. ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తుండటం అందులో భాగమేనని అంటున్నారు పరిశీలకులు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంప్లాయిస్ కోసం ఏమేం చేశామో గుర్తు […]
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..! ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర […]