Off The Record: కలకలం రేపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్.. ఎవరి గురించి ?
- ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్న జీవన్‌రెడ్డి..
- రెండేళ్ళుగా అలకాస్త్రాలు, ఫైనల్‌గా వదిలేసిన పార్టీ పెద్దలు..
- ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం..
- కలకలం రేపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..
- నాయకత్వం సైలెంట్‌గా ఉందంటే చేతగానితనం కాదన్న పొన్నం..
- సరైన సమయంలో స్పందిస్తుందని పొన్నం కామెంట్స్..
- కొన్నేళ్ళుగా మంత్రి, మాజీ మంత్రి మధ్య కోల్డ్‌వార్..
- గతంలో జీవన్ అలిగినప్పుడు శ్రీధర్‌బాబు, అడ్లూరి బుజ్జగింపులు..
- తనకు పదవులు రాకుండా పొన్నం అడ్డుపడుతున్నారని జీవన్ ఆవేదన..
- జీవన్‌కు ఈసారి రాజ్యసభ సీటు ఇస్తారంటూ అనుచరుల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనే పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట గాంధీభవన్ వర్గాల్లో. అందుకు తగ్గట్టే… జగిత్యాల పరిణామాలతో అవకాశం దొరికినప్పుడల్లా… సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారాయన. నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా…. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు ఎమ్మెల్యే సంజయ్.వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్…. తన పార్టీకే చేరువ కావడం మింగుడు పడటం లేదట జీవన్ రెడ్డికి.. దీంతో రెండేళ్లుగా అలకల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. ప్రారంభంలో వాటికి కాస్త రియాక్ట్ అయి బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం… ఇక రొటీన్ అయ్యేసరికి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరిన జీవన్‌రెడ్డి పార్టీపై దాదాపు తిరుగుబాటు చేసినతం పని చేస్తున్నారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఇటీవలి ఎన్నికల్లో స్వతంత్రులను బరిలోకి దింపి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయింది. అటు ఎమ్మెల్యే సంజయ్, ఇటు జీవన్ రెడ్డి మధ్య వార్తో నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ రాయికల్‌ను కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలే అంటున్నారు.
ఈ విషయంపై పార్టీ పెద్దలు సీరియస్ అయినా…. జీవన్ డోంట్ కేర్ అన్నట్టు సమాచారం. ఆయన విషయంలో పార్టీ సీరియస్‌గా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో… మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అవసరాల రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది… పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? నాయకత్వం సైలెంట్‌గా ఉందంటే… అది చేతగాని తనమో, అలసత్వమోనని అనుకోవద్దు. సరైన సమయంలో పార్టీ కచ్చితంగా స్పందిస్తుందంటూ…. జీవన్ ఎపిసోడ్‌పై స్పందించారు పొన్నం. అయితే మాజీ మంత్రికి, ప్రస్తుత మంత్రికి మధ్య కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోందట. మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య అంత సఖ్యత ఏమీ లేదని చెప్పుకుంటున్నారు. అటు గతంలో జీవన్ అలకపాన్పు ఎక్కినప్పుడు మరో మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండగా నిలిచారు.వారి బుజ్జగింపులతోనే అప్పట్లో మెత్తబడ్డారట జీవన్… అందరూ వచ్చి పలకరించినా పొన్నం మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారట… పైగా జీవన్ పార్టీపై కామెంట్స్ చేసిన ప్రతిసారి…. రాష్ట్ర నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం అన్నట్టు సమాచారం…
Also Read
- OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
- OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- OTR: తన బయోపిక్ పక్కన పెట్టి సోనియా గాంధీపై సినిమా? జగ్గారెడ్డి ప్లాన్ ఏంటి?
కొందరి మద్దతు జీవన్‌కి దక్కినప్పటికి.. పొన్నం నుంచి మాత్రం రివర్స్ అయిందట… తనకు ఎమ్మెల్సీ రెన్యూవల్ విషయంలో, క్యాబినెట్ స్థాయి పదవి ఇచ్చే విషయంలో చర్చలు జఠిగినప్పుడు కూడా పొన్నం అడ్డుపడ్డారని పలుమార్లు బాహాటంగానే అనుచరుల ముందు వాపోయారట జీవన్‌రెడ్డి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో తమ నేతకు ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు జీవన్ అనుచరులు… సరిగ్గా ఇదే సమయంలో క్రమశిక్షణా చర్యలు అంటూ మంత్రి పొన్నం కామెంట్ చేయడం సరికొత్త చర్చకు తెర తీసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరును పార్టీకి గుర్తు చేసేందుకే పొన్నం ఈ కామెంట్స్ చేశారనే చర్చలు సాగుతున్నాయి… పెద్దలు జీవన్ రెడ్డిని పెద్దల సభకు వెళ్లకుండా చేసేందుకు పార్టీలో గట్టి ప్రయత్నాలే సాగుతున్నట్టు పొన్నం హింట్ ఇచ్చారనేది ఇంకో వెర్షన్. జీవన్ వైపే ఉన్నట్టుగా చెబుతున్న జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఏ స్టెప్ తీసుకుంటారు..? పొన్నం జీవన్ మధ్య వార్ బహిర్గతం అవుతుందా అనేది వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!