ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ నేతలు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారట. నియోజకవర్గ ఇంఛార్జ్లుగా ఉన్న నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ, మండల, జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయటంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. త్వరలో జిల్లా పర్యటనలు చేస్తానని స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పటంతో పార్టీ అధిష్టానం పార్టీ పదవులను భర్తీ చేయటంపై ఫోకస్ పెట్టింది.
తిరుమలలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేసింది.. అమరావతిని శాసన రాజధానిని చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొన్నారు.. ఆ దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది.. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి? నే చర్చ సాగుతుండగా.. మూడు రాజధానులపై మా స్టాండ్ ఏంటో త్వరలో చెప్తాం అన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి…
వివాదాస్పద పోస్టులతో కేసులు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్బాబు నేతృత్వంలోని టీమ్.. ఆర్జీవిని ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు ఆరు గంటలుగా ఆర్జీవీ విచారణ కొనసాగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే ఆ పోస్టింగ్స్ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు ఆర్జీవీ..…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.. మరోవైపు ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు విధులు, సభలో సభ్యుల నడుచుకునే తీరు వంటి అంశాలపై సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటించింది.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాల్లో వరద పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుంది సెంట్రల్ టీమ్.. వరద ముంపును అంచనా వేసేందుకు వచ్చిన బృందం వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
స్వర్ణాంధ్ర 2047 సాధనకు తోడ్పాటు అందివ్వాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరిని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ లో ఏఐకు సంబంధించి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం... ఏపీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అని.. నీతి ఆయోగ్ సహకారం కూడా అవసరం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్.. ఈ నెల 15వ తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు తమన్.. తలసేమియా బాధితులకు సహాయార్థం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ మ్యూజిల్ నైట్ ద్వారా వచ్చిన సొమ్మును తలసేమియా బాధితులకు అందజేయనున్నారు..