Rain Forecast: ఏపీకి భారీ వర్ష సూచన..! 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు..
- 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు..
- తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి.. ఇదే సమయంలో.. భారీ వర్షాలు.. కొన్ని చోట్ల పిడుగుల వర్షం కురుస్తోంది.. అయితే, రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. రానున్న మూడు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ పేర్కొన్నారు.. రేపు అనగా మంగళవారం రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. ఇక, ఎల్లుండి కూడా పలు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు.. మరోవైపు.. నిన్న అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్ర, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు..
Read Also: Pahalgam Terror Attack: పాక్-భారత్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!