ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది.
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది
జన్‌లోక్‌పాల్ అన్నాడు! అవినీతికి వ్యతిరేకం అన్నాడు! చివరికి అదే అవినీతి ఊబిలో కూరుకుపోయాడు! అది 2011 సంవత్సరం. ఢిల్లీ జంతర్‌మంతర్. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ వ్యవస్థను తీసుకురావాలని అన్నాహజారే దీక్ష చేస్తున్న రోజులవి. అదే వేదికపై పెద్దసైజు కళ్లద్దాలు పెట్టుకొని, ఓ వ్యక్తి అటూఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు. సగటు మధ్యతరగతి మనిషిలా ఉండే, ఆ మిడల్ ఏజ్డ్ పర్సన్ మీడియాను ఆకర్షించాడు. యువకులను ఆలోచింపజేశాడు. సీనియర్ సిటిజన్ల దృష్టిలో పడ్డాడు.
ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా.. వరుస దొంగతనాలు ఆ గ్యాంగ్ పనేనా..? పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ప్రశ్న.. పగలంతా రెక్కీ చేస్తారు, తాళాలు వేసిన ఇళ్లకు కాపలా పడుకుంటారు.. సరిగ్గా సమయం కుదిరింది అనుకుంటే ఇల్లు గుల్ల చేసేస్తారు.. సెల్‌ఫోన్ వాడరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ మొహాలు కనపడనివ్వరు..
పల్నాడు జిల్లాలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు... తనది పురుషోత్తమ పట్నం అని, తనపై అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారు అంటూ మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు... నాకే కాదు కుటుంబం, ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా కుటుంబం ఉంటుందని, తాను మరో 30 ఏళ్లు చిలకలూరిపేట రాజకీయాల్లోనే ఉంటానని, నేను అధికారంలోకి వస్తే, రాజకీయాల నుండి రిటైర్డ్ అయినా సరే పుల్లారావు సంగతి చూస్తానని, ఘాటు…
దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని.. బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఎన్డీఏ కూటమిలోని సీఎంల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.. బీహార్‌లో నితీష్ కుమార్, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించామన్ నమోడీ.. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారంటూ ప్రశంసలు…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీకి, ఢిల్లీకి దగ్గరి పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. లిక్కర్ పేరుతో సిస్టమ్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు..
బీజేపీ ఘన విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ విజయం చారిత్రాత్మకం.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత దేశం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది అన్నారు.. ఢిల్లీలో వాయు కాలుష్యం.. రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉంది.. ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుంది.. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ అన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే ఢిల్లీ విజయం సాధ్యం అయ్యిందన్నారు.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని పేర్కొనర్నారు..