గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు లభ్యమవుతాయని భావిస్తున్న ఏపీ పోలీసులకు ఓ రకంగా షాక్ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ మోహన్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు విజయవాడలోని పటమట పోలీసుల సోదాలు.. దాదాపు రెండు గంటలపాటు వంశీ ఇంట్లో సోదాలు చేశారు పటమట పోలీసులు.. వంశీ ఫోన్ కోసం ఆయన ఇంట్లో విస్తృతంగా గాలించారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నా హామీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టపడి బటన్ నొక్కి అన్ని హామీలు అమలు చేసినా.. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారో తెలపాలి అంటూ వైఎస్ జగన్‌ను నిలదీశారు..
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాటి ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ప్రేమోన్మాది గణేష్‌ను అరెస్ట్ చేశారు పోలిసులు. నిందితుడు గణేష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు.. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటామని.. దీని కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. వల్లభనేని వంశీరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం.. నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందన్నారు..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ వాహనం గన్‌మెన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది.. రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుండగా బ్యాగ్ మాయమైంది. అందులో 30 బుల్లెట్లతో గన్ మ్యాగ్జైన్ ఉండటం పోలీసు శాఖలో కలకలం రేపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను రమణను విధుల నుంచి సస్పెండ్ చేశారు పార్వతీపురం జిల్లా ఎస్పీ..
ప్రేమికుల రోజు వచ్చిందట.. ఎంతో కాలంగా తమలో దాచుకున్న ప్రేమను.. వెల్లడించి.. కొత్త ప్రపంచంలో విహరించేందుకు.. మనసువిప్పి మాట్లాడుకునేందుకు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ఇలా ఎన్నో జంటలు సిద్ధం అవుతున్నాయి.. అయితే, ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది.
ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. భారత్‌లోనూ గతంలో జరిగినా.. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి..