కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి వెళ్లిన ఆయన.. శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు.. స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు.. ఆది ప్రణవనాదం ఓం కార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం.. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై.. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా గురువారం తంజావూరు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు పవన్.
వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ - 30 అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు.. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.. అయతే, పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అని మండిపడిన ఆయన.. వంశీ తల్లి, చెల్లి కూడా ఈ మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచదని అనుకుంటున్నారని పేర్కొన్నారు.. వంశీతో పాటు మరో నాలుగైదు జంతువులు కూడా ఊచలు లెక్కపెట్టి తీరాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలిందని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, ఈ వార్తలపై సీరియస్‌గా స్పందించారు ఏలూరు జిల్లా కలెక్టర్.. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందన్న ఆమె.... అయితే, జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో.. భారత్‌లోనే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ప్లు కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని స్పష్టం చేశారు.
జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవు అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. JEE (Mains) - 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను అభినందించారు లోకేష్..
మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది..
సత్యవర్ధన్ వ్యవహారంలోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.. సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.. వంశీపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పడమట పోలీసులు.. పడమట పీఎస్‌లో 86/ 2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. బీఎంఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ త్రి బై 5 సెక్షన్ల కింద.. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 సెక్షన్ 5ల కింద కేసు నమోదు చేశారు..