జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది జనసేన పార్టీ.. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ సారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేనాని నిర్ణయం తీసుకుంది.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. ఈ మేరకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్పై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను ఇచ్చింది.. ఈ అంశానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతోంది... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకు వెళ్లారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. ఈ రోజు మంత్రి డోలతో సమావేశమైన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు..
రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు..
మహా కుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీని మంత్రి లోకేష్ షేర్ చేయడంతో వైరల్గా మారిపోయింది..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.
ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు..
మహా కుంభమేళా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ.ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది.ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు..టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది.అన్నిదారులు ప్రయాగ్ రాజ్ వైపే.ఏ రైలు చూసినా, ఏ బస్సు చూసినా కిటకిటే. ఎవరినోట విన్న కుంభమేళామాటే.స్వయంగా వెళ్లిన వారి ఆనందం మాటల్లో వర్ణించిలేనిది.
వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. కొన్ని నెలలుగా నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ.. గత నెల నుంచి వంట నూనె ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో వంట నూనె ధరలు పెరుగుతున్నాయి. భారతీయులు వినియోగించే వంట నూనెలో 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో మూడేళ్ల క్రితం రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి.