ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్... జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే మన స్టైల్ అన్నట్టుగా ఉంటారట ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014లో బీఎస్పీ తరపున గెలిచి ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పంచన చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కోనప్ప.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో హీట్ పుట్టిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలను తలపించేలా నడుస్తోంది వ్యవహారం. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. అలాగే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న.. పిడిఎఫ్తోపాటు ఇతర ఉద్యోగ సంఘాలుకూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి.. సవాల్ విసురుతున్నారు.
రెడ్ బుక్లో పెట్టిన పేర్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. గతంలో గన్నవరంలో ఓ దళితుడిని కిడ్నాప్ చేసి టీడీపీ ఆఫీస్ మీద కేసులు విత్ డ్రా చేయించిన వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు లోకేష్. ఆ కేసుల వల్లే మాజీ శాసనసభ్యుడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు దూకుడుగా వ్యవహరించారని, కొన్ని సందర్భాల్లో తమ విషయంలో పరిధి దాటి కూడా ప్రవర్తించారన్నది టీడీపీ నేతల అభిప్రాయం. కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి, జోగి, వల్లభనేని వంశీ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్లపై మాటల దాడి చేస్తే... పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఎక్కువ మాట్లాడే వారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు మారుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో నాయకులని సమన్వయ పరుస్తూ నడిపించిన థాక్రే ను ఫలితాలు రాగానే పంపించేశారు. అప్పటివరకు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా ఉన్న దీపా దాస్ మున్షీ ఆ తర్వాత ఇన్చార్జిగా అదనపు బాధ్యతలతో నిన్నటి వరకు వ్యవహరించారు. అయితే.. దీపాదాస్కు అధిష్టానం మంచి అవకాశాన్ని ఇచ్చినా... పూర్తి స్థాయిలో పార్టీని, నాయకత్వాన్ని సమన్వయ పరచలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ షష్ట షణ్ముఖ ఆలయాల సందర్శన ముగిసింది.. చివరగా తిరుత్తణి ఆలయ దర్శనం చేసుకున్న పవన్.. ఈ రోజు మధ్యాహ్నానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. మొత్తం ఆరు దేవాలయాలను తమిళనాడులో, కేరళలో ఒక దేవాలయం దర్శించుకున్నారు పవన్.. తిరుమల లడ్డూ వ్యవహారంపైన ఆలయాల సందర్శనలో స్పందించారు. ఆయుర్వేద ప్రధానమైన ఆలయాలను దర్శించుకుని, తన ఆరోగ్య పరిస్థితిని సైతం అక్కడి వైద్యులకు చూపించుకుని, వైద్య సలహాలు తీసుకున్నారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
డబ్బుల కోసం ఓ భర్త సైకోగా మారిపోయాడు.. నువ్వు ఏదైనా చేసి.. చివరకు.. నాకు మాత్రమే చూపించాల్సిన నీ అందాలను.. ఆన్లైన్లో చూపించూ.. న్యూడ్ కాల్స్ చేసి.. మొత్తానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.. భార్యను న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు ఓ సైకో భర్త... ఆ వేధింపులను తట్టుకోలేక.. తన భర్త నుండి రక్షణ కల్పించాలని మీడియా ముందుకు వచ్చింది తిరుపతికి చెందిన శ్రీదేవి అనే మహిళ
అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు లభ్యమవుతాయని భావిస్తున్న ఏపీ పోలీసులకు ఓ రకంగా షాక్ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్లోని వల్లభనేని వంశీ మోహన్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు విజయవాడలోని పటమట పోలీసుల సోదాలు.. దాదాపు రెండు గంటలపాటు వంశీ ఇంట్లో సోదాలు చేశారు పటమట పోలీసులు.. వంశీ ఫోన్ కోసం ఆయన ఇంట్లో విస్తృతంగా గాలించారు.