భూ కేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్.. యుద్ధ వాతావరణంపై చర్చ!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. మరోవైపు.. తాజాగా జరిగిన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ, సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు, తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రధాని మోడీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది.
తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్
ఈ రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ కీలక ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక దిగ్గజం ఎజీ సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు తిరుపతి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీసిటీ వేదిక కానున్నది. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆ ప్లాంట్ కు పలురకాల రాయితీలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి దశలో 188 ఎకరాలను కేటాయించింది. 1500 మందికి ప్రత్యక్షంగా, మరో అయిదారు వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది.. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 కింద ప్రకటించిన రాయితీలకు ప్రతిస్పందించిన ఎల్‌జీ యాజమాన్యం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి లాంఛనంగా ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత దశలో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలో దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ బహుళ ఉత్పత్తుల వాణిజ్య నగరంగా పేరొందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడ ను ఎల్ జి సంస్థ ఎంపిక చేసుకుంది.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నేడు జగన్ భేటీ.. తర్వాత బెంగళూరుకు..!
పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఇవాళ తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో భేటీకాబోతున్నారు.. వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.. ఇటీవల అవిశ్వాస తీర్మానాలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్.. మరోవైపు.. ఇవాళే బెంగుళూరు వెళ్లనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. సాయంత్రం 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.. ఇక, రాత్రి 8.00 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్..
భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్ అనంతరంగా ఏర్పడిన పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు.
డిజాస్టర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.. ఎక్కడ చూడాలంటే
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో నిర్మాతకు అడ్వాన్స్ లు గట్టిగానే ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్స్. భారీ ఓపెనింగ్ ఉంటుందని ఊహించారు. కానీ బయ్యర్స్ ని నిండా ముంచేశాడు జాక్. స్పై యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తోలి ఆట నుండే ప్లాప్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. ఏప్రిల్ 10 న థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమాను నేటి నుండి అనగా 8నుండి స్ట్రీమింగ్ కు చేసింది నెట్ ఫ్లిక్స్. తెలుగు, తమిళ్, మలయాళం, హింది, కన్నడ భాషాల్లో జాక్ ను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో డిజాస్టర్ ఆయిన జాక్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. కాగా ఈ సినిమా ప్లాప్ తో బొమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. అయితే ఈ సినిమా మేకింగ్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ వేలుపెట్టాడనే టాక్ టాలీవుడ్ లో గట్టిగా ఉంది. 28 రోజుల థియేటర్ రన్ తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చిన జాక్ ఏ మేరకు మెప్పిస్తాడో.
రెబల్ స్టార్ సినిమాలో బడా నిర్మాత లిటిల్ డాటర్
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు రెబల్ స్టార్. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసిన హను సెకండ్ షెడ్యుల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు. ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ చేసున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచలి నిర్మిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ లో సినిమాలో వచ్చే కీలకమైన చైల్డ్ హుడ్ డేస్ ఎపిసోడ్స్ ను తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు హను. అయితే ఒక చిన్న పాత్రలో చిత్ర నిర్మాతలలో ఒకరైన మైత్రీ రవిశంకర్ కుమార్తె లిషా నటించిందట. చిన్న పిల్ల అయినా చాలా బాగా చేసిందట. యూనిట్ మొత్తం లీషా ను అబినందించారట. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలను సిద్ధం చేసాడట. విశాల్ మ్యూజిక్ పట్ల హను రాఘవపూడి సంతృప్తిగా ఉన్నాడట. బ్రిటిష్ కాలం నాటి రాజకార్ల పాలనలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ప్రభాస్ ఈ చిత్రంలో అగ్రహారం యువకుడిగా కనిపిస్తాడని అలాగే కాప్ లోను కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
చిరంజీవి- శ్రీకాంత్ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టా లెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ ముగింపు దశకు చేరుకోగా, ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో మూవీ చేయనున్నారు. ఇది చిరంజీవి 158వ చిత్రంగా రాబోతుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.. చిరుతో సినిమా అంటే మాములు విషయం కాదు. అందుకే శ్రీకాంత్ ఈ చిత్రం కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాని నిర్మతగా వ్యావహరిస్తున్నా ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటించనున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో దీపికా పదుకొనేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమచారం. ప్రభాస్ ‘కల్కి’ మూవీలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా దీపిక మరి చిరంజీవి కోసం ఈ సినిమాను ఓకే చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో కూడా వరుస చిత్రాలు ఉన్నాయి. మరి చిరు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో..