ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 30 గంటల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవడంతో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను విజేతగా ప్రకటించారు అధికారులు..
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెద్ద మార్కెట్. కానీ కొన్నాళ్లుగా రెండు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏపీలో అయితే గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది. మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో వచ్చిన బూమ్ కారణంగా ఏడాది పాటు పర్లేదనిపించింది. ఆ సమయం మినహా ఇంకెప్పుడూ రియల్ ఎస్టేట్ బాగున్న దాఖలాల్లేవు.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా మారుతున్న టాక్ పెరుగుతోంది లోకల్‌గా. ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికే మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూ దందాలపై అలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న గౌతమి సూపర్ బజార్‌కు సంబంధించిన 300 గజాలు స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు ఐదు కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని నాడు…
2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన 9 నెలలకు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇన్నాళ్ళు ప్రభుత్వ పరంగా పాలనా వ్యవహారాల్లో మునిగితేలిన బాబు... ఇప్పుడిప్పుడే పార్టీ మీద దృష్టిపెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో.. ఇంతకు ముందులా స్వీట్ వార్నింగ్స్ కాకుండా... ఘాటు హెచ్చరికలు వెళ్ళడంతో...ఒక్కసారిగా టాప్ టు బాటమ్ పార్టీ అటెన్షన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది.
వల్లభనేని వంశీ మోహన్ కిడ్నాప్ కేసులో కీలకంగా ఉన్న సత్య వర్ధన్ 164 స్టేట్మెంట్ను పోలీసులకు న్యాయస్థానం సోమవారం అందజేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్య వర్ధన్ ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ సత్య వర్ధన్ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాడు.
జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చినప్పుడు, రాజకీయ నేతలకు ఊహించిన పదవులు దక్కినప్పుడు... ఆ మాటలే వేరుగా ఉంటాయి. ఇంకేముంది... ఇరగదీసేస్తాం... దున్నేస్తాం...మనకడ్డేలేదంటూ మాటలు పేలుతుంటాయి. సరే... చేతల్లోకి వచ్చేసరికి అది ఎంతవరకన్నది వేరే సంగతి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందని అంటే.... తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న వాతావరణానికి సంబంధించిన చర్చ. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ వచ్చేశారు. కానీ... ఆమె రొటీన్‌కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి అచ్చెన్నాయుడు.. మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్సీపీ యూ టర్న్ తీసుకుందన్న ఆయన.. యూ టర్న్ తీసుకుందంటేనే వాళ్ల తలాతోకలేని విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు..
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ ఓ వెలుగు వెలిగిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ దెబ్బతో డీలాపడిపోయింది. ఇక... గడిచిన పదేళ్ళలో రాష్ట్రం నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్ఎస్లోకి తర్వాత కాంగ్రెస్‌లోకి చేరిపోయారు.
ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. జనసైనికులు, యువకులు, వీరమహిళలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై.. దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 14 తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో సన్నాహత సమావేశాన్ని పార్లమెంట్ సమన్వయ కర్త హోదాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్వహించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు దొరబాబు.. ఇక, దొరబాబు చేరికకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ నెల 9వ తేదీన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లతో కలిసి విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..