Vijayawada: విజయవాడలో ఘోరం జరిగింది.. స్థానికంగా నారా చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు.. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటుంది.. అయితే, విద్యుత్ షాక్‌తో ఒక్కే కుటంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు.. వరుసగా ముగ్గురు మృతిచెందారు.. ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఇలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. మృతుల్లో ప్రసాద్ (61), ఆయన భార్య హేమ వాణి (54), చెల్లెలు ముత్యావల్లి (55)గా గుర్తించారు పోలీసులు.. బాధితుడు ప్రసాద్ లారీ డ్రైవర్‌గా పని చేస్తాడు.. ఘటన ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు.. కాలనీలో విషాదఛాయలు అలుముకోగా.. శోక సంద్రంలో ఆ కుటుంబ సభ్యులు మునిగిపోయారు..
Read Also: Road Accident: కడపలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్