పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చారని అరెస్ట్ చేశారు.. 41 ఏ నోటీస్ ఇచ్చి వదిలే కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకోవడం లేదని తెలుస్తుందన్నారు. ఇప్పుడు నరసరావుపేట తీసుకొచ్చారు.. బాపట్ల పోలీసులు పీటీ వారెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు.. అసలు భారత రాజ్యాంగం నడుస్తుందా? లోకేష్ రాజ్యాంగం నడుస్తుందా? అని ప్రశ్నించారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతోన్న వేళ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక చర్చలు జరిగాయి.. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు ఛాంబర్‌కు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్.. అసెంబ్లీ హాల్ నుంచి సిఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఛాంబర్‌కు వెళ్లిన పవన్..
కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయమన్న ఆమె.. అక్రమంగా 111 కేసు పెట్టి , పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా...? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా? అని నిలదీశారు..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు..
వల్లభనేని వంశీ మోహన్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఒంటరిగా ఉంచి డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని ఈ రోజు ములాఖత్‌లో కలిశారు పంకజ శ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ.. వంశీకి ఆస్తమా, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయ వాది మధు.. రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రేపటి నుంచి రైల్వే కోడూరు జడ్జ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న కారణంగా ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకోలేదు. ఇక, శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది..
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. 2025 - 26 వార్షిక బడ్జెట్‌తో పాటు.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు..
నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు.. దాంతో పాటు.. ఇప్పటికే ఎన్నో బడ్జెట్లను సూచిన సభ్యులు కూడా ఉన్నారని తెలిపిన ఆయన.. బడ్జెట్ ను అందరూ చదవాలి.. బడ్జెట్ పత్రాలను అన్ని పెన్ డ్రైవ్ లో ఇస్తాం. సభ్యులు వాట్సాఅప్ గ్రూప్ లో పెట్టుకోవాలి. నియోజకవర్గ పరిధిలో సరళ మైన భాషతో బడ్జెట్‌పై చెప్పాలని సూచించారు..