వివిధ అభివృద్ధి పథకాలకు భారీగా నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం. బడ్జెట్లో డ్రిప్ ఇరిగేషనుకు పెద్ద పీట వేసింది.. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది.. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్లో వెల్లడించింది..
పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, పోసాని కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఐటీ యాక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది.. పోసానిపై త్రిబుల్ వన్ కేసు పెట్టడానికి వీలులేదన్నారు.. వర్గ వైశమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్లు వల్లే రిమాండ్ ఉంటుంది..
న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి... తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన.
సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్పై నేడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు ఇవాళ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.
ఇవాళ అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9గంటలకు కేబినెట్ అమోదించాక.. సభలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు,