Vallabhaneni Vamsi Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టులో షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై అత్యవసర విచారణకు నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. వంశీ హౌస్ మోషన్ పిటిషన్‌పై వచ్చే గురువారం విచారణ చేపడతామని ఈ సందర్భంగా చెప్పింది న్యాయస్థానం.. ఇక, అనారోగ్యంతో బాధ పడుతున్న తనకు మధ్యంతర బెయిల్ ఇస్తే చికిత్స చేయించుంకుంటానంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కూడా వచ్చే గురువారం విచారణ చేయనున్నట్టు హైకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది..
Read Also: Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
మరోవైపు, వల్లభనేని వంశీ మోహన్ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది నూజివీడు కోర్టు.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసిన నూజివీడు కోర్టు.. ఇక, వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగాకు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ జిల్లా కోర్టు.. తేలప్రోలులో స్థలం కబ్జా చేసిన కేసులో రంగాకీ బెయిల్ ఇచ్చింది.. అయినా వేరే కేసుల్లో రిమాండ్ లో రంగా ఉండటంతో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..