Deputy CM Pawan Kalyan: మహానాడుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ఈ పదం విన్నా, చదివినా..!
- మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక..
- ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టిన పవన్ కల్యాణ్..
- మహానాడు.. ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది టీడీపీ..
- తెలుగు దేశం పార్టీ అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కడప మొత్తం పసుపు మయం అయ్యింది.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు అంగరంగవైభవంగా సాగుతోంది.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న ఈ మహానాడుకు ప్రాధాన్యత ఏర్పడింది.. అయితే, కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మహానాడు ప్రారంభమైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలుగుదేశం పార్టీపై ప్రశంసలు కురిపించారు..
Read Also: KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. విచారణకు వెళ్లేది ఆ రోజే..?
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్.. “మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”.. అంటూ పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
*మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక*
మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై… కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా…
— Pawan Kalyan (@PawanKalyan) May 27, 2025
తాజావార్తలు
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!