Gummanur Jayaram: మాజీ మంత్రి, గుంతకల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పట్టణ, మండల కమిటీల ఏర్పాటుపై పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాట్లాడుతూ.. మన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసినా.. నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. కానీ, మనం మాత్రం.. కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.. రేపు రాబోయే ఎన్నికలలో ప్రతి కార్యకర్త కలిసిమెలిసిగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు, స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను నామినేషన్లు కూడా వేయకుండా చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
Read Also: Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?
నన్ను రౌడీ అన్నారు.. కూనికోరు అన్నారు.. నేను రౌడీని కాదు.. నాది అందరినీ ప్రేమించే గుణం అన్నారు గుమ్మనూరు జయరాం.. కేసులే పెట్టాలి అనుకుంటే.. ఈ ఏడాది కాలంలో అందరిపై కేసులు పెట్టేవాళ్లం.. కానీ, మాకు అలాంటి వ్యవహారాలు చేయం అన్నారు.. అయితే, స్థానిక సంస్థల్లో పార్టీ పెట్టిన అందరు అభ్యర్థులను గెలుపించుకోవాల్సిన బాధ్యత మనది.. దయచేసి ఎవరి కాలు పట్టుకుని గుంజే ప్రయత్నం చేయొద్దు అన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. కాగా, ఇప్పటికే ఓ వైపు మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్‌పై ఆరోపణలు, విమర్శలు, కామెంట్లు వినపడుతోన్న వేళ.. ఇప్పుడు గుమ్మనూరు జయరాం కూడా తానూ రెడ్‌బుక్ ఓపెన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చగా మారింది..