Off The Record: బందరు పొలిటికల్ వార్ పీక్స్‌లో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మేటర్ రాజకీయాలు దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు కొల్లు రవీంద్ర. ఇక 2024లో కొల్లు మంత్రి అయ్యాక పరిస్థితులు తిరగబడ్డాయి. పేర్ని నాని మీద ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కేసు నమోదవగా, నకిలీ ఇళ్ళ పట్టాల పంపిణీ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వారం క్రితం పేర్ని అరెస్టు కాబోతున్నారని, ఆయన పరారీలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పేర్ని అరెస్టు తప్పదని కొల్లు రవీంద్ర, నేను వెయిటింగ్ అంటూ నాని మాటల తూటాలు పేల్చేశారు. ఆ సందర్బంలోనే నాని డోస్ పెంచటంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొల్లు రవీంద్రను దాటి మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేల మీద పడుతోందట. మంత్రి కొల్లు మీద అవినీతి, అక్రమాల ఆరోపణలు చేసే క్రమంలో పామర్రు, గుడివాడ ఎమ్మెల్యేలను బరిలోకి లాగారు మాజీ మంత్రి. తోట్లవల్లూరు ఇసుక రీచ్‌ను కొల్లు రవీంద్ర, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కలిపి తవ్వుతున్నారని, రోజుకు ఐదు లక్షల రూపాయల చొప్పున చెరి సగం తీసుకుంటున్నారంటూ బాంబ్ పేల్చారు పేర్ని.
Read Also: Off The Record: ఆ నాయకుడు చనిపోయాక పార్టీ మారబోతున్నారా..?
దీంతోపాటు ఐలూరు రీచ్‌లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్థానిక ఎంపీతో కలిసి కొల్లు రవీంద్ర గండ్ర ఇసుకను ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు పేర్ని. ఈ రీచ్‌ల నుంచి రోజూ వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఆరోపించారు మాజీ మినిస్టర్. ఇదే ఇప్పుు హాట్ టాపిక్ అయింది. వాళ్లు వాళ్ళు కొట్టుకుంటూ మధ్యలో మా పేర్లు ఎందుకు లాగుతున్నారని బాధపడిపోతున్నారట కుమార్ రాజా, వెనిగండ్ల. స్థానిక ఎంపీ బాలశౌరి పేరు కూడా పేర్ని నాని ప్రస్తావించినప్పటికీ… గత ప్రభుత్వ హయాం నుంచి ఇద్దరికీ విబేధాలు ఉండటంతో.. ఆ కారణాలు ఉండి ఉండవచ్చని లైట్ అయిపోయిందట. అదే సమయంలో తొలిసారి గెలిచిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై కామెంట్స్ మాత్రం రచ్చ రేపుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిపై పేర్ని నాని చేసిన ఆరోపణలు ఇటు టీడీపీ, అటు వైసీపీలో కూడా చర్చనీయాంశం అయినట్టు చెప్పుకుంటున్నారు. గుడివాడ, పామర్రు రెండు నియోజకవర్గాల్లో తొలిసారి గెలిచారు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా. ఇద్దరూ వివాదాలకు దూరంగా ఉంటారన్నది పొలిటికల్ టాక్. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే… ఆ రెండు నియోజకవర్గాల్లో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పేర్ని నాని ఆరోపిస్తున్నారుగానీ.. వీటికి సంబంధించి స్థానిక వైసీపీ నాయకులు మాత్రం నోరెత్తడం లేదట.
Read Also: Matrimonial Fraud: రెండో పెళ్లి కోసం చూస్తే.. భరణంగా వచ్చిన రూ. 3.6 కోట్లు కొల్లగొట్టిన మోసగాడు..
పామర్రులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా… అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటంలేదని పబ్లిక్‌గానే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో…కొల్లు రవీంద్రను టార్గెట్ చేస్తున్న క్రమంలో…. పేర్ని నాని తమ పేర్లను కూడా లాగడంతో ఉలిక్కిపడ్డారట ఇద్దరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు. వాళ్ళు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోమనండిగానీ… అనవసరంగా మాజోలికి ఎందుకు వస్తున్నారని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అలాగని పేర్ని ఆరోపణలకు ఎమ్మెల్యేలు ఇద్దరూ కౌంటర్ వేశారా అంటే… అదీ లేదు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించకుండా…. ప్లీజ్ మా జోలికి రావద్దన్నట్టుగా మాట్లాడ్డం ఏంటి? మా తవ్వాకాలేవో మమ్మల్ని చేసుకోనివ్వండని అంటున్నారా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయవర్గాలు. పేర్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారోనని ఆసక్తిగా చూస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. మాజీ మంత్రికి కౌంటర్ ఇస్తారా లేక కామ్‌గా ఉంటారా అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్.