మాజీ మంత్రి కాకాణి కేసులో మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి.. కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి. ఊరు బిండి చైతన్యలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, విచారణ హాజరైనందుకు ప్రభాకర్ రెడ్డి.. చైతన్య.. గోపాలకృష్ణారెడ్డి సమయం కోరారు..
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదైన కేసులో తదుపరి కార్యాచరణ కోసం పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఆయనను విచారించేందుకు మూడుసార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించిన కాకాణి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.. నెల్లూరు, హైదరాబాద్తో పాటు మరికొన్ని చోట్ల ఆరా తీస్తున్నారట పోలీసులు..
బర్డ్ఫ్లూలో బాలిక మృతిచెందడం ఇదే తొలిసారి కావడంతో.. కేంద్రం సైతం రంగంలోకి దిగింది.. నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు సిద్ధం చేశారు.. అలాగే వాటిని అవలంభించడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేశారు.. గత ప్రభుత్వం పాలసీలు చేసి గైడ్ లైన్స్ ఇవ్వకుండా వదిలేసిన వాటికి సైతం గైడ్ లైన్స్ ఇచ్చారు... యువ పారిశ్రామికవేత్తలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మూడు ప్రధాన పాలసీలను రూపొందించారు.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ప్రధాన టార్గెట్ గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రులకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే కాగా.. దీనిలో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీలను…
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
కీచకుడి కామ దాహానికి మెడికల్ విద్యార్థిని బలైపోయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న మెడికల్ విద్యార్థిని అదే ఆస్పత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న కీచకుడు వంచించాడు. పెళ్లి చేసుకుంటానని ని నమ్మించి మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది ఆ యువతి. మరణమే శరణ్యం అనుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడి 12 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.
శ్రీశైలం ఆలయానికి వెళ్తుండగా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, ఈ ప్రమాదంలో తృటిలో తప్పించుకుని బయటపడ్డారు ప్రయాణికులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగి భక్తుల కారు దగ్ధం అయ్యింది.. గుంటూరుకు చెందిన భక్తులు ఇన్నోవా కారులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది..
మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ వాయిదా పడింది.. అయితే, ఈ రోజు కీలక వాదనలు జరిగాయి.. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. అసలు రాజకీయ కక్షతో రజినిపై కేసు నమోదు చేశారని హైకోర్టులో వాదనలు వినిపించారు రజిని తరఫు న్యాయవాది..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మూడు 'సీ'లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు 'సీ'లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కర్నూలులో జరుగుతోన్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటైంది.. స్వాతంత్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు.