CM Chandrababu: వైఎస్ వివేకా కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- వైఎస్ వివేకా హత్య కేసులో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- బాబాయిని చంపి నా మీదే ఆరోపణలు చేశారు..
- మొదట గుండెపోటు అన్నారు..
- పోస్టుమార్టం తర్వాత మా నాన్న లేరు... చిన్నాన్న హత్యకు గురయ్యారన్నారు..
- మరుసటిరోజు నారాసుర రక్తచరిత్ర అన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ లో దొరికిపోయారని పేర్కొన్నారు.. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడిచేస్తే వారికి సంఘీభావం చెబితే చూస్తూ ఊరుకోవాలా.? అని ప్రశ్నించిన ఆయన.. బాబాయిని చంపి నా మీదే ఆరోపణలు చేశారు.. మొదట గుండెపోటు అన్నారు.. పోస్టుమార్టం తర్వాత మా నాన్న లేరు… చిన్నాన్న హత్యకు గురయ్యారన్నారు. మరుసటిరోజు నారాసుర రక్తచరిత్ర అన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అయితే, ఆ రోజే నిందితులను అరెస్టు చేసి ఉంటే ఇలాంటివి జరిగేనా..? అని ప్రశ్నించారు చంద్రబాబు..
Read Also: MP: ఏకంగా సీఎం కాన్వాయ్ వాహనాల్లో కల్తీ డీజిల్.. ఒక్కసారిగా ఆగిన 19 కార్లు..!
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
అత్యంత దారుణంగా గొడ్డలితో వైఎస్ వివేకాను హత్యచేశారు.. కొత్తతరం రాజకీయం వచ్చింది.. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు.. పోలీసులు వారి ముసుగు తీసి వారిని నేరస్థులుగా చూడకపోతే లా అండ్ ఆర్డర్ కాపాడలేరన్నారు.. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టాం.. పోలీసులకు బాడీ కెమెరా ఇచ్చాం.. పల్నాడులో తప్పుచేసి ఎలా బుకాయిస్తున్నారో చూశాం.. తప్పుచేస్తామంటే ఊరుకోం.. టెక్నాలజీ లేనప్పుడే నేనేంటో చూపించా.. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఏంచేస్తామో మా ప్రభుత్వం చేసి చూపిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?