వైఎస్ జగన్‌కు ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ ఈ కేసులో ఏ2గా ఉన్నారు. జగన్ తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగన్ పీఏ, మాజీ మంత్రి పేర్ని నాని, విడదల రజినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని వచ్చే మంగళవారానికి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇక, పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ కాకుండా ప్రయాణికులకు ఏం సంబంధం అని హైకోర్టు ప్రశ్నించింది. పర్మిషన్ సందర్భంగా కొన్ని కండిషన్స్ పాటించాలని చెప్పినా.. జగన్ పాటించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నా కుంభ మేళాలో ప్రమాదం జరిగింది కదా? అని న్యాయస్థానం పేర్కొంది. ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారనీ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సింగయ్య మృతి కేసులో జగన్ పర్యటనకు ఇచ్చిన పర్మిషన్ నిబంధనలకు ఉల్లంఘించినట్టు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు అందజేయానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సింగయ్య ప్రమాదానికి గురైన సమయంలో అంబులెన్స్ కి, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
సీబీఎన్ సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు స్థానం లేదు..
చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీని పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఏఐ హ్యాక్ థాన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అన్నారు.. లా అండ్ ఆర్డర్ పై ఎప్పుడూ దృష్టిపెడతాను. చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశారు.. టెక్నాలజీని అందరూ ఉపయోగించుకోవాలని సూచించిన ఆయన.. అప్పట్లో బిల్ క్లింటన్, వాజ్ పేయి హయాంలో సైబర్ సిటీ, హైటెక్ సిటీ ప్రారంభించాం. 25 ఏళ్లలో ఐటీవల్ల ఎక్కువ ఆదాయం హైదరాబాద్‌కు వస్తుందని తెలిపారు.. క్వాంటం వ్యాలీకింద ఏఐకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిచెప్పబోతున్నాం. మీ పిల్లలను బాగా చదివించండి… మీరు పెట్టిన ఖర్చుకు అనేకరెట్లు సంపాదిస్తారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగువారు ఉంటారని తెలిపారు.
ఆయేషా మీరా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఎన్‌కు ఆమె తల్లి విజ్ఞప్తి..
ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ నివేదిక ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు జరిపింది. బాధితులుగా ఉన్న ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటి వరకు 18 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగారని మళ్ళీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయటంతో వచ్చే శుక్రవారానికి తదుపరి విచారణ ను కోర్టు వాయిదా వేసింది. ఆయేషా మీరా రీ పోస్ట్ మార్టం రిపోర్ట్, పార్టులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకురావటంతో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
వైఎస్ వివేకా కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ లో దొరికిపోయారని పేర్కొన్నారు.. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడిచేస్తే వారికి సంఘీభావం చెబితే చూస్తూ ఊరుకోవాలా.? అని ప్రశ్నించిన ఆయన.. బాబాయిని చంపి నా మీదే ఆరోపణలు చేశారు.. మొదట గుండెపోటు అన్నారు.. పోస్టుమార్టం తర్వాత మా నాన్న లేరు… చిన్నాన్న హత్యకు గురయ్యారన్నారు. మరుసటిరోజు నారాసుర రక్తచరిత్ర అన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అయితే, ఆ రోజే నిందితులను అరెస్టు చేసి ఉంటే ఇలాంటివి జరిగేనా..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. అత్యంత దారుణంగా గొడ్డలితో వైఎస్ వివేకాను హత్యచేశారు.. కొత్తతరం రాజకీయం వచ్చింది.. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు.. పోలీసులు వారి ముసుగు తీసి వారిని నేరస్థులుగా చూడకపోతే లా అండ్ ఆర్డర్ కాపాడలేరన్నారు.. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టాం.. పోలీసులకు బాడీ కెమెరా ఇచ్చాం.. పల్నాడులో తప్పుచేసి ఎలా బుకాయిస్తున్నారో చూశాం.. తప్పుచేస్తామంటే ఊరుకోం.. టెక్నాలజీ లేనప్పుడే నేనేంటో చూపించా.. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఏంచేస్తామో మా ప్రభుత్వం చేసి చూపిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
రెండో పెళ్లి కోసం చూస్తే.. భరణంగా వచ్చిన రూ. 3.6 కోట్లు కొల్లగొట్టిన మోసగాడు..
మ్యాట్రిమోనీ సైట్లను నమ్ముకుని మోసపోతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తప్పుడు మాటలు చెప్పడం, మహిళల్ని నమ్మించడం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా పూణేకు చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం చూస్తే, ఆమెకు మొదటి భర్త ద్వారా వచ్చిన భరణం డబ్బుల్ని మోసపోవాల్సి వచ్చింది. మోసం చేసని వ్యక్తిని పూణే సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ రోహిత్ ఒబెరాయ్ అనే ఆస్త్రేలియా డాక్టర్‌గా నటిస్తూ, ఉత్తర్ ప్రదేశ్ లక్నోకు చెందిన అభిషేక్ శుక్లా ఏకంగా మహిళ దగ్గర నుంచి రూ. 3.6 కోట్ల డబ్బును మోసం చేశాడు. పూణేలోని ఖరాడి ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసింది. నిందితుడు శుక్లా పన్నిన ఉచ్చులో పడింది. 2023లో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ పౌరుడిగా డాక్టర్ రోహిత్ ఒబెరాయ్ అని చెప్పుకునే వ్యక్తి బాధిత మహిళను సంప్రదించాడు. కాలక్రమేణా, ఇద్దరూ సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. పూణేతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో వేర్వేరు ప్రదేశాల్లో కలిసి నివసించారు.
టీవీఎస్ నుంచి కొత్త బైక్ విడుదల.. ధర ఎంతంటే?
బైక్ లవర్స్ కోసం మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది టీవీఎస్ కంపెని. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2విని విడుదల చేసింది. కంపెనీ దీనిని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసింది. 2025 TVS Apache RTR 160 2V ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,34,320, ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ. దీని ధర రూ. 1,30,520. ఇది మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ఈ రెండు కలర్ ఆప్షన్లతో రెడ్ అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా అందించారు. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2వి 16.04 PS శక్తిని, 13.85 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 159.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేయబడింది.
గోల్డ్ ధరలు ఢమాల్.. ఒక్కరోజె రూ. 930 తగ్గిన తులం బంగారం ధర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ముగియడంతో, మార్కెట్లో స్థిరత్వం తిరిగి వచ్చింది. నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే తులం బంగారం ధర రూ. 930 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,802, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,985 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 850 తగ్గింది. దీంతో రూ.89,850 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 930 తగ్గింది. దీంతో రూ. 98,020 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అనుష్క, కీర్తి సురేష్ బాటలో రష్మిక..!
రష్మిక అంటే నేషనల్ క్రష్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్లో ఆమెను కొట్టే బ్యూటీనే లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. రష్మిక అంటే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఊహించని సినిమా అనౌన్స్ మెంట్. అదే మైసా. ఈ రోజు వచ్చిన పోస్టర్ లో ఆమె చాలా వయోలెంటిక్ పాత్ర చేస్తోందని అర్థం అవుతోంది. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ పోస్టర్ ను చూస్తే అనుష్క, కీర్తి సురేష్ గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్లు కూడీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము లేపారు. ముఖ్యంగా అనుష్క చేసిన అరుంధతి సినిమాతో యూత్ లో మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ దెబ్బతో తన మార్కెట్, రెమ్యునరేషన్ అన్నీ పెరిగిపోయాయి. అలా అని హీరోల సరసన చేయడం ఆపలేదు. అటు కీర్తి సురేష్ కూడా అంతే. మధ్యలో మహానటి సినిమా చేసి తన స్థాయిని పెంచేసుకుంది. అప్పటి నుంచే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఇంకా పెంచుకుంది. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో వెళ్లి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ఇన్ని రోజులు గ్లామర్ హీరోయిన్ చేసిన ఆమె.. ఇప్పుడు నటన పరంగా యాక్షన్ పరంగా నిరూపించుకుని సొంతంగా ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూస్తోంది. ఆల్రెడీ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయినా.. దాన్ని మరింత బలంగా మార్చుకునేందుకు ఈ మైసా మూవీ చేస్తోందని సమాచారం.
ఎంటర్‌టైనింగ్గా కిరీటి రెడ్డి ‘జూనియర్’ టీజర్
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ జూనియర్‌తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదలైంది.ఈ టీజర్ సినిమా టోన్, హిలేరియస్, ఫుల్-ఆన్ ఎంటర్‌టైనింగ్ స్నాప్‌షాట్‌ను అందిస్తుంది. కిరీటి ఒక రిలాక్స్డ్ కాలేజీ కుర్రాడు, మార్క్స్ కంటే హ్యాపినెస్ ని ఇష్టపడతాడు, తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించే వ్యక్తిత్వం ఉన్న తను శ్రీలీలను ఇష్టపతాడు, మొదట గొడవతో మొదలైన జర్నీ మెల్లాగా ఎట్రాక్టివ్ కెమిస్ట్రీగా మారుతుంది. ఇక టీజర్ లో కిరీటి అదరగొట్టాడు. తన డ్యాన్స్ మూవ్స్, స్టంట్స్, స్పాట్-ఆన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయి.
ప్రతి ఇంటి కథ.. ప్రతి ఒక్కరి కల .. కనీళ్ళు తెప్పించేలా 3BHK ట్రైలర్
మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. జీవితంలో అనేక నిరాశలు, వైఫల్యాలను ఎదుర్కొన్న ఒక తండ్రి, తన కుటుంబ ఆశలన్నీ తన కొడుకుపై పెట్టుకుంటాడు. కానీ, 34 ఏళ్ల వయస్సులోనూ ఉద్యోగం లేక, చదువులో వెనుకబడిన ఆ కొడుకు, ఈ కథలో కీలకమైన వ్యక్తిగా నిలుస్తాడు. ఈ కుటుంబం తమ కలను సాకారం చేసుకుంటుందా అనే ప్రశ్నే ఈ సినిమా కథ. మధ్యతరగతి జీవితాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయడం అనేది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు, అది గౌరవం, స్థిరత్వం, సంతృప్తికి చిహ్నం. దర్శకుడు శ్రీ గణేష్ తన భావోద్వేగపూరిత రచన, ఆకట్టుకునే కథనంతో ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారనే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి మరి .