కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.. ఈ లోపే వాటి పేర్లను విడుదల చేశారు.. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఏపీకి రానుండగా.. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్రగా ప్రకటించారు..
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మాజీ మంత్రి అనిల్ ని పుష్ప మూవీలో మంగళం శ్రీను తో పోల్చి విమర్శలు గుప్పించారు.. కరోనా సమయంలో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి మాజీ మంత్రి అనిల్ లక్షల రూపాయలు దండుకున్నారు..
కువైట్ ఫ్లైట్ లో మిస్సైన పెనగలూరు మండలం పొందలూరు వాసి రాజబోయిన మనోహర్ కథ విషాదాంతం అయ్యింది. మార్గ మధ్య లో రాజబోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్ కావడంతో ఆయనను ప్లేట్ సిబ్బంది శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన నిన్న మృతి చెందారు..
ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహిస్తుండగా.. విశాఖలోని ఆర్కే బీచ్ లో వందల మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణ బాబు, కలెక్టర్, సిటీ పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. జూన్ 21 విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది.. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగ అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు.. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. ఇక, కుప్పం పర్యటన ముగించుకొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు...
రైతులకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను ముందుగానే పలకరించబోతున్నాయి.. కేరళ తీరాన్ని ముందుగానే తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.