Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్‌గా నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్.. అంబటి 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.. 2024 ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం విదితమే.. అయితే, ఈ తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.. నాది చాలా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం.. రేపల్లెలో ప్రారంభమైన నా రాజకీయ జీవితం సత్తెనపల్లి నుండి గుంటూరుకు వచ్చింది.. నా రాజకీయ జీవితంలో, ప్రయాణంలో అనేక మజిలీలు ఉన్నాయి.. నా చివరి మజిలీ గుంటూరు.. ఎందుకంటే.. 70 సంవత్సరాలకు చేరువలో ఉన్నాను.. దాదాపుగా రిటైర్మెంట్ కు వస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు..
Read Also: Kannappa : కన్నప్పపై ట్రోల్స్ అందుకే రావట్లేదు.. విష్ణు కామెంట్స్
ఇక, నా చివరి మజిలీని గుంటూరుతో ఇచ్చారని భావిస్తున్నాను అంటూ వైసీపీ అధిష్టానం నిర్ణయంపై కామెంట్ చేశారు అంబటి.. గత మూడు సార్లు గుంటూరు పశ్చిమలో వైసీపీ గెలవలేకపోయింది.. టీడీపీ కంచుకోట, అంబటి రాంబాబు ఢీ కొట్టగలడా? అని అప్పుడే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు.. 2024 ఎన్నికల్లో ఈవీఎంల మహత్యంతో గెలిచారనే ప్రచారం జరుగుతుంది. అత్యంత టఫ్ గా ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని గెలుచుకోవడమే మన టార్గెట్ అన్నారు మాజీ మంత్రి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ అంబటి రాంబాబు..