ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మొత్తం 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరిగింది.. వాటిపై చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి మండలి.. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో చర్చ సాగింది..
ప్రవీణ్ పగడాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు. మాజీ ఎంపీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదన్నారు.. రోడ్డు ప్రమాదం కాదు కచ్చితంగా హత్యే నంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని నా అనుమానం అన్నారు.
డిస్కంలకు శుభవార్త చెప్పంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ విడుదలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.. మూడు ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.4,470 కోట్లు విడుదల ద్వారా వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ భరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది..
ఇసుక దోపిడీ కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ గేట్లను విరగొట్టారు అంటూ సంచలన ఆరోణలు చేశారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.
: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఇందులో 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే, జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీ జనసేన పార్టీ ఖాతాలోకి చేరింది. గత నెల 20వ తేదీన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు 17 మంది సంతకాలతో ఛైర్మన్ ఆదినారాయణపై కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
కేటీఆర్పై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా? అని సవాల్ చేశారు.. ఎవరి గురించి మాట్లాడాడో చెప్పకుండా... ఒక ఎంపీ అని గాలివార్త చెప్తే సరిపోదు కదా..? అని నిలదీశారు..
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు.. ప్రజల అందరూ ఆ నేతల భూతులు వినలేక.. పోలింగ్ భూత్లోకి వెళ్లి ఓటు వేసి ఓడించారు.. భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని పేర్కొన్నారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం ఉత్తీర్ణత.. సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు.. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్.. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు.. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు వచ్చేలోపు ప్రవీణ్ ఆరుగురితో మాట్లాడినట్టు గుర్తించాం..
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు..