Perni Nani: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.. విజయవాడ సబ్ జైల్ దగ్గర ఆయనకు స్వాగతం పలికిన మాజీ మంత్రి పేర్నినాని.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్యగా పేర్కొన్నారు.. ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టి.. ఇలా వేధించినా.. వల్లభనేని వంశీ మాత్రం గన్నవరం వదిలి పారిపోడు అని స్పష్టం చేశారు.. వంశీ గన్నవరంలోనే ఉంటాడని పేర్కొన్నారు.. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల చర్యల ద్వారా వంశీకి ఏడాదిలోనే ప్రజల్లో సానుభూతి వచ్చింది.. వంశీపై చర్యల ద్వారా గన్నవరంలో అధికార పార్టీని గోతిలో పాతేసినట్టే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Read Also: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
ఇక, జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీకి విజయవాడ సబ్ జైలు దగ్గర స్వాగతం పలికారు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైసీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తి.. పలువురు వైసీపీ శ్రేణులు, వంశీ అభిమానులు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..