IndiGo Flight Emergency Landing: భారత్‌లో వరుస విమాన ప్రమాదాలు.. ప్రయాణికులను కొంత భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. 222 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీంతో, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.. అయితే, మొత్తం ఇండిగో విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. తాము ప్రయాణించే విమానం ఒక్కసారిగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.. మరోవైపు, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా ఇదే ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపం సరిచేసి పంపిస్తారా? తెలియని పరిస్థితుల్లో ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది..
Read Also: Off The Record: ఇంటింటికి టీడీపీ నేతలు.. జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా..!?