Heavy Rains in AP: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొడుతున్నరాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, మన్యం., ఏలూరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని రోజులు మోస్తరు వానలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చ రికల కేంద్రం వెల్లడించింది. ఇక, దక్షిణ ఝార్ఖండ్ మీద అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. మరోవైపు బికనీర్ నుంచి సెంట్రల్ ఇండియా మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది. వీటన్నింటి సానుకూలత వల్ల వారం రోజుల పాటు వానల ప్రభావం వుండనుంది. ఇక తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారుల వేటను నిషేధించారు. ఇక, గడచిన 24 గంటల్లో వేలేరుపాడులో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూనవరంలో 9, కుకనూరులో 8, చింతూరులో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు విశాఖ తుఫాన్ హెచ్చ రికల కేంద్రం అధికారులు..
Read Also: Champions League T20 : మళ్ళీ రాబోతున్న టీ20 ఛాంపియన్స్ లీగ్..